Lemon pickle: నూనె వాడకుండా నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Published : May 22, 2026, 12:32 PM IST

Lemon pickle: పుల్లని నిమ్మకాయ పచ్చడి తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నోరు చప్పగా ఉన్నప్పుడు నిమ్మకాయ పచ్చడి తినాలనిపిస్తుంది. నూనె వాడాల్సిన అవసరం లేకుండా నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము. 

PREV
13
టేస్టీ నిమ్మకాయ పికెల్

వేసవి వచ్చిందంటే చాలు ఊరగాయలు చేసేందుకు సిద్ధమైపోతారు. పుల్లని నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే పప్పు, అన్నం, రొట్టె ఇలా దేనితో తిన్న టేస్టీగా ఉంటుంది. కొంతమంది నూనెతో నిండిన నిమ్మకాయ పచ్చడి తినేందుకు భయపడతారు. అయితే నూనె లేకుండా ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడిని కమ్మగా చేసుకోవచ్చు. ఈ ఊరగాయలో కొవ్వు ఏమాత్రం ఉండదు. నూనెలేని నిమ్మకాయ పచ్చడి నెలలు తరబడి నిలవ కూడా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

23
నిమ్మకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు

పెద్ద నిమ్మకాయలు 20 వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండు స్పూన్ల ఆవాలు, ఒక టీ స్పూన్ సోంపు, ఒక స్పూను పసుపు పొడి, పావు స్పూను ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను నల్ల ఉప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను వాము, ఒక స్పూను నల్ల మిరియాలు సిద్ధం చేసుకోవాలి.

33
నిమ్మకాయ పచ్చడి ఇలా చేయండి

ఆరు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేయాలి. ఆ తర్వాత వాటిని నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. అలాగే మిగతా నిమ్మకాయల నుంచి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రత్యేకంగా నిమ్మకాయ రసాన్ని జోడించడం వల్ల నిమ్మపచ్చడికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో సోంపు, జీలకర్ర, వాము, నల్ల మిరియాలు చిన్న మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. మరోవైపు ఆవాలు, సోంపు, పసుపు, ఇంగువ, సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఒక గిన్నెలో ఈ దంచిన పొడిని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న సోంపు మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గాజు పాత్రలో ఈ మసాలా మిశ్రమాన్ని వేయాలి. ఇందులోనే నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇక నిమ్మకాయ ముక్కలు కూడా ఇందులోనే వేయాలి. నిమ్మకాయ ముక్కలు మునిగేంత వరకు నిమ్మరసం ఉండేలా చూసుకోవాలి. దీని పైన మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. రెండు రోజులకు టేస్టీ నిమ్మకాయ పచ్చడి సిద్ధం అయిపోతుంది. ఇందులో నూనె లేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories