Coconut Water: ఈ వ్యాధులు మీకుంటే కొబ్బరినీళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

Published : Mar 31, 2026, 11:39 AM IST

Coconut Water: కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లను తాగడం మంచిది కాదు. ఎవరు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలో తెలుసుకోండి. 

PREV
14
వేసవిలో కొబ్బరినీళ్లు తాగవచ్చా?

వేసవి వచ్చిందంటే కొబ్బరి బోండాలు విపరీతంగా అమ్ముడుపోతాయి. కొబ్బరి నీళ్లు తాగితే చాలు.. డీహైడ్రేషన్ సమస్య రాదు. ఇందులో ఉండే పోషకాలు కూడా ఆరోగ్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే కొబ్బరినీళ్లు ప్రతి ఒక్కరికీ ఒకేలాంటి ప్రయోజనాలను ఇవ్వవు. కొంతమందికి హాని కూడా చేయవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్ళు తాగితే వారికి ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. ఎవరు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలో తెలుసుకోండి.

24
కిడ్నీ వ్యాధులు ఉంటే

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదు. కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. అప్పటికే మూత్రపిండాలు దెబ్బతిని ఉన్న రోగులు ఈ పొటాషియం ఉన్న నీళ్లను తాగితే ఇబ్బంది పడతారు. కిడ్నీలు ఆ నీటిని శుద్ధి చేయలేదు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తే ఒకసారి వైద్యుల సలహా తప్పకుండా తీసుకునే తాగండి.

34
మధుమేహం ఉన్నా కూడా

మధుమేహ రోగులు కొబ్బరి నీటిని అతిగా తాగితే ప్రమాదం. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరినీటిని తాగితే రక్తంలో చక్కెర మరింతగా పెరిగిపోతుంది. రక్తపోటు కూడా అప్పటికే తగ్గి ఉంటే మీరు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదు. ఇది రక్తపోటును కూడా చాలా తగ్గించేస్తుంది. కాబట్టి లోబీపీ, హై బ్లడ్ షుగర్ ఉన్నవారు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

44
జలుబు, దగ్గు

కొబ్బరినీళ్ళకు చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. వేసవిలో తాగితే ఎంతో మంచిది. అయితే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటితో బాధపడుతున్న వారు మాత్రం కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇది మరింత చలవ చేస్తుంది.దీని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని మరింతగా పెంచేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories