Get rid of Lizards: ఈ 5 మొక్కల్ని ఇంట్లో పెంచారంటే బల్లులు మీ ఇంటివైపుకే రావు

Published : Dec 22, 2025, 12:54 PM IST

Get rid of Lizards: ఇంట్లో బల్లులు ఉంటే చాలా మందికి నచ్చదు. బల్లులను తరిమికొట్టే మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇవి అందంగా కనిపించడమే కాదు కీటకాలు కూడా దూరంగా ఉంటాయి.  ఇంటిలోని ప్రతి మూల నుంచి బల్లులను తరిమికొట్టగల ఐదు మొక్కలు ఏవో తెలుసుకోండి.

PREV
15
బల్లులను దూరం చేసే మొక్కలు

ఇళ్లలో బల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా సాధారణ సమస్యగా కొట్టిపడేస్తారు. అవి ఎక్కువగా ఆహార పదార్థాల చుట్టే తిరుగుతుంటాయి. బల్లుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తే అవకాశం ఉంది.  వాటిని తరిమికొట్టడానికి మార్కెట్లో చాలా రసాయన నివారణలు ఉన్నాయి. కానీ ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉండటం వల్ల వాటిని వాడడం మంచిది కాదు. కొన్ని మొక్కలు ఇంట్లో పెంచితే ఆ వాసనకు బల్లలు ఇంట్లోంచి బయటికి పోతాయి. ఈ మొక్కలను తలుపులు, కిటికీలు, బాల్కనీలలో ఉంచడం వల్ల ఈ బల్లులు ఇంటికి దూరంగా ఉంటాయి. బల్లులను తరిమికొట్టే ఐదు మొక్కల గురించి చూద్దాం. 

25
రోజ్ మేరీ మొక్క

రోజ్‌మేరీ మొక్క పెంచడం చాలా సులువు. ఇది ఉన్న చోట బల్లులు ఉండవు. బల్లులు దాని వాసనను ఏమాత్రం ఇష్టపడవు. రోజ్‌మేరీ మొక్కను కుండీలలో పెంచడం సులభం. మీరు దానిని మీ బాల్కనీలో, కిటికీ దగ్గర లేదా తలుపు దగ్గర ఉంచవచ్చు. ఇది కీటకాలను, బల్లులను కూడా దూరంగా ఉంచుతుంది.

35
పుదీనా

పుదీనా వాసన మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ బల్లులకు మాత్రం మంచిది కాదు.  పుదీనా నుంచే ఘాటైన వాసన బల్లులు ఇష్టపడవు. దీని ఆకులు పచ్చగా ఉన్నప్పుడు దాని సువాసన బలంగా ఉంటుంది. దీన్ని తలుపుల దగ్గర, మూలల్లో లేదా బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో పెడితే అవి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాయి.

45
యూకలిప్టస్

యూకలిప్టస్ మొక్కలను నీలగిరి అని పిలుస్తారు. దీని నుంచి సహజ నూనెలు ఉంటాయి. వాటి బలమైన వాసన బల్లులతో సహా అనేక జీవులకు నచ్చదు.  మీరు ఎండ తగిలే ప్రదేశంలో కుండీలలో చిన్న నీలగిరి మొక్కలను నాటవచ్చు. వాటి బలమైన సువాసన బల్లులను తరిమికొడుతుంది.

55
పెన్సిల్ ట్రీ

బల్లులు పెన్సిల్ ట్రీని కూడా ఇష్టపడవు. దీని నుంచి వచ్చే వాసన, దాని రసం ఏమాత్రం ఇష్టపడవు. అందుకే బల్లులు వీటి దగ్గరకు రావు. ఈ మొక్క వెచ్చని ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. దీని రసాన్ని నేరుగా తాకకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇది అలెర్జీకి కారణం అవుతుంది. కాబట్టి పెన్సిల్ చెట్టును మీ తోటలో లేదా టెర్రస్‌పై నాటండి.

బల్లులు నిమ్మగడ్డి వాసనను ఇష్టపడవు. కాబట్టి కుండీలో లెమన్ గ్రాస్ నాటి పెంచితే మంచిది. ఎందుకంటే దీని నుంచి నిమ్మ వాసన వస్తుంది. ఆ వాసనకు బల్లులు బయటికి పారిపోతాయి. ఈ మొక్క త్వరగా పెరుగుతుంది. కుండీలలో లేదా తోటలో సులభంగా పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories