Upma: ఇలా చేశారంటే ఉప్మా ఎవరైనా సరే వదలకుండా తినేస్తారు, పొడి పొడిగా వస్తుంది

Published : Oct 07, 2026, 04:17 PM IST

Upma: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా చేస్తే ఎవరూ తినేందుకు ఇష్టపడరు. దీన్ని పొడిపొడిగా, రుచిగా రావాలంటే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లల కోసం ఉప్మా చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ పాటిస్తే వాళ్లు ఇష్టంగా తింటారు.

PREV
13
రుచికరమైన ఉప్మా ఎలా చేయలి?

బిజీ జీవితాల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడమే పెద్ద టాస్క్. అందులోనూ సింపుల్ గా ఉప్మా చేస్తే ఎవరూ తినరు. హడావిడిగా చేయడం వల్ల రోజూ ఒకే రుచితో రాదు. ఒక్కోసారి చేసిన ఐదు నిమిషాలకే గట్టిపడుతుంది. ఇంకోసారి పొడిపొడిగా వస్తుంది. అందుకే పిల్లలు ఉప్మా అంటేనే ఆమడ దూరం పరుగెడతారు. ఉదయం బిజీ టైమ్‌లో కూడా పిల్లలు చూసిన వెంటనే తినేలా, నోరూరించేలా ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

దక్షిణ భారత శైలిలో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కారణం అందులో వాడే కూరగాయలే. దీనికి పెద్దగా సామాన్లు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉప్మా రవ్వ ఎప్పుడూ స్టాక్ ఉంటుంది. కూరగాయలు, పోపు దినుసులు ఉంటే చాలు నిమిషాల్లో ఉప్మా రెడీ అవుతుంది. రవ్వను వేయించి, కూరగాయలు, మసాలా దినుసులు కలిపి పొడిపొడిగా అయ్యేలా ఉడికిస్తే ఉప్మా సిద్ధం. ఇది ఉదయం పూట కడుపు నింపే పోషకమైన ఆహారం. మీకు నచ్చిన రంగు, రుచితో దీన్ని తయారు చేసుకోవచ్చు.

23
ఉప్మా ఇలా చేయండి

ఉప్మా రుచిగా రావాలంటే ముందుగా మంచి క్వాలిటీ ఉన్న రవ్వను కొనాలి. తక్కువ ధరకు వస్తుందని నాసిరకం రవ్వ కొంటే ఉప్మా అస్సలు బాగుండదు. కాబట్టి నాణ్యమైన రవ్వను ఎంచుకోండి.

ఉప్మా చేయడానికి ముందు రవ్వను ఒక కడాయిలో వేసి సన్నని మంట మీద కొద్దిసేపు వేయించండి. నూనె లేదా నెయ్యి వేయకండి, వట్టి రవ్వనే వేయించండి. కొద్దిసేపటికి మంచి సువాసన వస్తుంది. రంగు మారేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ముందుగా వేయించడం వల్ల ఉప్మా జిగురుగా మారదు. అంతేకాకుండా రవ్వ సరిగ్గా ఉడుకుతుంది.

33
రెసిపీ చాలా సింపుల్

ఇప్పుడు ఒక చిన్న కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. అది వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు లేదా పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి మెత్తబడే వరకు వేయించండి.

మీరు పిల్లల కోసం ఉప్మా చేస్తుంటే పచ్చిమిర్చి తక్కువగా వాడండి. ఒక్కసారి కారం ఎక్కువైతే పిల్లలు ఉప్మా వంక కూడా చూడరు. కారం తక్కువగా ఉంచి, రుచిని పెంచడానికి క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్ లాంటి కూరగాయలను సన్నగా తరిగి వేసుకోవచ్చు. దీనివల్ల పోషకాలు కూడా అందుతాయి.

ఉప్మా తయారీలో నీళ్లు, రవ్వ సరైన కొలతల్లో వేయడం చాలా ముఖ్యం. మెత్తటి, పొడిపొడి ఉప్మా కావాలంటే ఒక కప్పు రవ్వకు రెండు లేదా మూడు కప్పుల నీళ్లు పోయాలి. మీకు కొంచెం ముద్దగా కావాలంటే ఇంకొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.

పోపు వేగిన తర్వాత నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ పోస్తూ గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉప్మా ఉండలు కట్టకుండా ఉంటుంది.

ఉప్మా రెడీ అయ్యాక రుచిని మరింత పెంచడానికి కొద్దిగా నెయ్యి వేయడం మంచిది. పిల్లలను ఆకర్షించడానికి కొత్తిమీర, క్యారెట్, బఠానీ, జీడిపప్పు లాంటివి వేస్తే వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

Read more Photos on
click me!

Recommended Stories