Health Tips: ఉదయాన్నే ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉంటారు..

Published : Feb 20, 2022, 09:50 AM IST

Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి మీకు తెలుసా. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లకు దూరంగా ఉండాలి. అందులోనూ అల్పాహారం తీసుకోకుండా అస్సలు ఉండకూడదు. లేదంటే బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.   

PREV
17
Health Tips: ఉదయాన్నే ఇవి తినండి.. ఆరోగ్యంగా ఉంటారు..

Health Tips: ఓవర్ వెయిట్ తో బాధపడేవారు చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తుంటారు. ఎక్కడ అవి తింటే ఇంకా లావైపోతామేమోనని. కానీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతేనే బరువు మరింత పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో అందంమైన శరీరాకృతిని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఈ బ్రేక్ ఫాస్ట్ లో పరిగడుపున ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

27

బాదం పప్పులు:  బాదం పప్పులను పరిగడుపున తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లల్లో పోషకాలు మెండుగా ఉండుగా ఉంటాయి. ఇక ఇందులో బాదం పప్పుల్లో విటమిన్లు, ఖనిజలవణాలు, ఎంజైములు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అంతేకాదు వివిధ ఆహారాల ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలకు ఈ బాదం పప్పులు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. అందులోనూ ఇవి చాలా తొందరగా జీర్ణమవుతాయి. వీటిని నీళ్లల్లో నానబెట్టి తింటే ఎంతో రుచి కరంగా ఉంటాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
 

37

సిట్రస్ ఫ్రూట్స్:  మెరుగైన ఆరోగ్యానికి సిట్రస్ ఫ్రూట్స్ ఎంతో అవసరం. ఇవి జీర్ణశక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండ్లు మన ఆకలిని, ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే లెమన్ వాటర్ ను తరచుగా తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

47

ఇకపోతే పరిగడుపున మామిడి పండు, పుచ్చకాయ, జామ, దానిమ్మపండు, బొప్పాయి పండ్లను తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండులో Pepine అనే enzyme పుష్కలంగా ఉంటుంది. ఇది Throat infection,Inflammation తగ్గించి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ బొబ్బాయి పండు Blood pressure ను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాని మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హై ఫైబర్  కంటెంట్ మన పేగుల్లో ఉండే వేస్టేజ్ నంతా తొలగిస్తుంది. ముఖ్యంగా డైజెస్టివ్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. 

57

తృణ ధాన్యాలు:  మినరల్స్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉండే అమర్నాథ్, బియ్యం, స్ల్పెట్, క్వీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్, ఫైబర్లు టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్, ఓబేసిటీ లక్షణాలు రాకుండా కాపాడుతాయి. 

67

పెరుగు: పెరుగలో ప్రోటీన్లు, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి. కాగా దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా అనిపించి ఎక్కువ సేపు ఆకలి లేకుండా చేస్తుంది. అంతేకాదు పెరుగుతో మన జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో నట్స్, ఫ్రూట్స్, సీడ్స్, కొద్దిగా తేనె కలిపి పరిగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 

77

ఖర్జూరం: పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ పరిగడుపున పిల్లలకు ఖర్జూరపండును ఇవ్వడం వల్ల వాళ్ల మెదుడు చురుగ్గా ఉంటుంది. కొంతమంది నైట్ అంతా బాగానే పడుకున్నా ఉదయం లేచే సరికి నీరసంగా కనిపిస్తుంటారు. ఎందుకంటే వారి శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి. అలాంటి వారు ఖర్జూరం పండు తింటే మళ్లీ హుషారుగా మారిపోతారు. ఖర్జూర పండులో పక్షవాతం, ఉదర సంబంధిత క్యాన్సర్లను రాకుండే చేసే గుణాలున్నాయి. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ మెడిసిన్ లా ఉపయోగపడుతుంది.  

click me!

Recommended Stories