కిస్ మిస్ ల నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. !

First Published Nov 27, 2022, 4:04 PM IST

ఎండుద్రాక్షలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఈ కిస్ మిస్ లను అలాగే కాకుండా నీళ్లలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
 

raisins water

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి  ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ తినాలని చెప్తుంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఎండుద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తాజా, ఆకుపచ్చ ద్రాక్షకంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కిస్ మిస్ ను అలాగే తినకుండా నానబెట్టి తినడం మంచిది. నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో పాటుగా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. నానబెట్టిన ఎండుద్రాక్షలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉదర సంబంధిత సమస్యలు నయమవుతాయి

ఎండుద్రాక్షలను నీళ్లలో నానబెట్టి తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపు ఆమ్లాన్ని నియంత్రించడానికి ఇది చక్కటి మార్గం.  దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రేగు పనిని మెరుగుపరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. ఎండుద్రాక్ష నీరు మీ జీర్ణవ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. 
 

raisins

శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది

ఎండుద్రాక్షల నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషం బయటకు పోతుంది. ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల రక్తాన్ని శుభ్రపడుతుంది కూడా. ఇది మాత్రమే కాదు.. ఈ నీటిని ఒక వారం పాటు తాగడం వల్ల మీకు  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఈ నీళ్లు మీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే దాని పనితీరును మెరుగుపరుస్తుంది.
 

raisins

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఎండుద్రాక్ష నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే అనేక వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి. ఈ నీళ్లు మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
 

హెయిర్ ఫాల్ ఆగిపోతుంది

ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎండు ద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. 
 

నిద్రలేమి

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యను బయటపడటానికి ఎండుద్రాక్ష నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ను పెంచుతుంది. ఇది నిద్ర రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. రాత్రిళ్లు మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 
 

click me!