ఈ రోజుల్లో చాలా మంది బట్టలను ఉతకడానికి వాషింగ్ మెషీన్లనే ఉపయోగిస్తున్నారు. అలాగని అందరి దగ్గర వాషింగ్ మెషిన్లు ఉన్నాయని కాదు. కానీ వాషింగ్ మెషిన్ లేకుండా బట్టలను ఉతకాలంటే గంటా, రెండుమూడు గంటల టైం అయితే పక్కాగా పడుతుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు బట్టలను కేవలం 10 నిమిషాల్లోనే ఉతికేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వైట్ బట్టలు
బట్టలు ఉతకడానికి ముందుగా.. వైట్ కలర్ బట్టలను వేరు చేయండి. దీంతో తెల్ల బట్టలు పాడవకుండా.. వేరే బట్టల రంగు అంటకుండా ఉంటాయి. ఆ తర్వాత 2 బకెట్లలో వేడి నీటిని పోయండి.
బట్టలను వేడినీటిలో నానబెట్టండి
ఇప్పుడు మీరు ఉతకాల్సిన బట్టలను బట్టి వేడినీటి బకెట్లలో డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు రంగురంగుల బట్టలన్నింటినీ ఒక బకెట్ లో పెట్టి, మరో బకెట్ లో వైట్ కలర్ బట్టలను నానబెట్టండి.
బ్రష్ తో శుభ్రం
ఉతకాల్సిన బట్టలన్నింటినీ.. వేడి నీటిలో 5 నుంచి 7 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఒక్కోటి తీసి బ్రస్ తో శుభ్రం చేయండి.
శుభ్రమైన నీటిలో..
బ్రష్ తో క్లీన్ చేసిన బట్టలను ఉతుకుతూ.. ఒక బకెట్ చల్లటి నీటిలో ముంచండి. అన్ని బట్టలను శుభ్రమైన నీటిలో 3-4 సార్లు ముంచి బయటకు తీయండి.
నీటిని పిండటం
శుభ్రమైన నీటిలో ఉతికిన బట్టలను రెండు మూడు సార్లు మంచి నీటిలో అద్దండి. ఆ తర్వాత బట్టలకు నీరు లేకుండా బాగా పిండండి. ఇలా చేయడం వల్ల బట్టలపై ఉండే డిటర్జెంట్, మురికి పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత ఈ బట్టలను ఖాళీ బకెట్ లో వేయండి.
బట్టలను ఎండలో..
ఇప్పుడు ఉతికిన బట్టలన్నింటినీ.. ఎండలో ఆరేయండి. ఈ విధంగా మీరు బట్టలను కేవలం 10 నిమిషాల్లో చేతితో సులభంగా శుభ్రం చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఈజీ కదా.. మీరూ ట్రై చేయండి.