అందమైన ఒత్తైన జుట్టు కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యకరమైన, బలమైన జుట్టును మెయింటేన్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పొడి జుట్టు, ఊరికే చిక్కులు పడిపోయే జుట్టు ఉన్నవారి విషయంలో ఇది చాలా కష్టమైన విషయం.
undefined
ఇలాంటి జుట్టు ఎక్కువ వేడిని తట్టుకోలేదు. దీంతోపాటు తగలనివ్వలేరు. స్కాల్ప్ ఎప్పుడూ తాజాగా, కాస్త తేమగా ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు జుట్టుకు మందపాటి కోటింగ్ తో కప్పేయకుండా ఉండాలంటే షియా బటర్ తో కోటింగ్ చేయడం వల్ల మీ జుట్టు సమస్యలు తీరతాయి.
undefined
దీనివల్ల బహుళ ప్రయోజనాలతో పాటు, ఎక్కువ మోతాదులో పోషకాలు కూడా జుట్టుకు అందుతాయి. షియా చెట్టు గింజల నుండి సేకరించిన కొవ్వు నుంచి ఈ బటర్ ను తయారు చేస్తారు.
undefined
రింగుల జుట్టు, పొడి జుట్టు ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుతో పాటు చర్మానికి కూడా గొప్ప హైడ్రేటర్ గా ఉపయోగపడుతుంది.
undefined
జుట్టు సంరక్షణకు షియా బటర్ ను వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..తల దురద, చుండ్రు నివారణకు శతాబ్దాలుగా ఈ షియా బటర్ ను వాడుతున్నారు. ఇది పొడి జుట్టుకు తేమను అందించడంతో బాగా పనిచేస్తుంది. తొందరగా ఇంకిపోతుంది. అలాగని తలమీద చర్మ రంధ్రాలను మూసేయదు. అందుకే ఇది జుట్టుకు మంచి చేస్తుంది. కలర్ వేసుకున్నా, హీట్ ట్రీట్మెంట్, కలర్ ట్రీట్మెంట్ తీసుకున్నా బాగా పనిచేస్తుంది.
undefined
చిక్కులు పడే జుట్టుకు షియా బటర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి జుట్టు తడిగా ఉన్నప్పుడు కాస్త మాట విన్నా, పొడిగా అయ్యాక అస్సలు చేతిలోకి రాదు. అలాంటప్పుడు షియా బటర్ ను ఉపయోగిస్తే మీ జుట్టు మీ మాట వింటుంది. అందుకే దీన్ని రింగుల జుట్టు చికిత్సలో ఎక్కువగా వాడతారు. దీంట్లోని ఎమోలియేటింగ్ గుణాలు జుట్టును జిడ్డుగా, భారంగా చేయకుండా తేమతో నిండి.. హాయిగా ఉండేలా చేస్తాయి .
undefined
షియా బటర్ జుట్టు మీద అలాగే నిలిచిపోదు. కాబట్టి జిడ్డుగా లేదా చిరాకుగా అనిపించదు. ఇది వెంటనే జుట్టు కుదుళ్లలోకి, లేదా వెంట్రుకల్లోకి ఇంకిపోతుంది. జుట్టుకు కోటింగ్ లా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టును స్ట్రెయిటనింగ్ లేదా హీట్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ వేడినుంచి రక్షిస్తుంది.
undefined
స్ప్లిట్ ఎండ్స్ సమస్యను నివారిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఆ జుట్టును ఆరోగ్యవంతంగా చేయడంలో షియా బటర్ బాగా పనిచేస్తుంది. వాటిని మరింత దెబ్బతినకుండా చివర్లను లాక్ చేస్తుంది. జుట్టుకు తేమను అందించి, పుష్కలంగా ఆరోగ్యకరమైన పోషకాలను ఇస్తుంది.
undefined
మరి ఇన్ని లాభాలున్న షియా బటర్ ఎలా వాడాలి?1. దురదలేని నెత్తికోసం : వేడినీటిలో షియాబటర్ గిన్నెను పెట్టి కరిగించాలి. అది చల్లారాక వేలి చివర్లతో బటర్ ను తీసుకుని నేరుగా మాడుకు అంటేలా రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఇంకాస్త చక్కటి ఫలితాల కోసం దీంట్లో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కూడా కలపచ్చు.
undefined
సీలెంట్ గా కూడా వాడొచ్చు. మీ జుట్టుకు ఇంకాస్త ఎక్కువ తేమను అందించడానికి మీ కండీషనర్ తో పాటు షియా బటర్ ను కలపచ్చు. షాంపూలు, హెయిర్ క్రీములతో ఇది బాగా కలిసిపోతుంది.
undefined
హెయిర్ మాస్క్‌గా కూడా వాడుకోవచ్చు. ఒక చిన్న సైజు కప్పులో 1 టేబుల్ స్పూన్ షియా బటర్, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి మైక్రోవేవ్‌లో కరిగించండి. అది చల్లబడిన తర్వాత, 1 టీస్పూన్ అర్గాన్ నూనె, మీకు ఇష్టమైన ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి. తరువాత హ్యాండ్ మిక్సర్‌తో మిక్స్ చేసి.. శుభ్రమైన జుట్టుపై పూయండి. జుట్టుకు మొత్తం అంటడానికి దువ్వెనతో దువ్వండి.
undefined
ఈ షియా బటర్ ను ఎలాంటి జుట్టుకు వాడొచ్చు.. అంటే..అన్నిరకాల నూనెలు, చిట్కాలు అన్నిరకాల జుట్టుకు సూట్ అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ లు కాబట్టి. చాలా జుట్టు రకాలు మందపాటి నూనెలను ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కానీ కొన్ని రకాల జుట్టు మాత్రం దానిని తట్టుకోలేదు. అలాంటి తలకట్టుకు షియా బటర్ ఉపయోగపడుతుంది.
undefined
షియా బటర్ చాలా రిచ్ గా ఉంటుంది. కాబట్టి పలుచటి జుట్టు ఉన్నవారు జుట్టు కుదుళ్లలో దీన్ని రాస్తే జుట్టు జిడ్డుగా, ఫ్లాట్ గా కనిపిస్తుంది. దీనికి బదులుగా, తేమ ప్రయోజనాలను పొందటానికి కొద్ది మొత్తాన్ని కేవలం జుట్టు చివర్లకు రాస్తే సరిపోతుంది.
undefined
షియా బటర్ ను ఎక్కువగా వాడటం వల్ల మీ జుట్టు జిడ్డుగా కనబడుతుంది. కాబట్టి బాగా పొడిగా లేదా గిరజాల జుట్టు ఉన్నవారికి షియా బటర్ బాగా హెల్ప్ అవుతుంది.
undefined
మీరు ప్రత్యేకంగా జుట్టు సంరక్షణ కోసం చూస్తున్నట్లయితే, రిఫైండ్ చేయని షియా బటర్ మంచిది. ప్రాసెస్ చేసిన షియా బటర్ వివిధ రూపాల్లో దొరుకుతుంది.
undefined