మన సమాజంలో స్త్రీ లైంగికత, కన్యత్వం మీద అనేక చర్చలు, ఆంక్షలు ఉంటాయి. అంతేకాదు కన్యత్వం కోల్పోవడం మీద అనేక అపోహల్ని అవే వాస్తవాలుగా నమ్ముతుంటారు. అంతేకాదు పెళ్లి కానివారు కన్యలని, అయితే కారని నమ్ముతారు ఇందులో వాస్తవం లేదు.
కన్యత్వం లేదా వర్జినిటీ అనేది నిజానికి ఓ పెద్ద అపోహ. చాలా క్లిష్టమైన అంశం. మన దగ్గర సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కన్యత్వానికి సంబంధించి అనే అపోహలు రాజ్యమేలుతున్నాయి.
వాటిల్లో కొన్ని చూడండి....కన్యగా ఉన్నవారికి మొదటిసారి కలయిక బాధాకరంగా ఉంటుందని నమ్ముతారు. ఎందుకంటే కన్నెపొర (హైమన్) చిరగడం వల్ల ఈ నొప్పి, కలయిక రక్తస్రావం జరుగుతుందని అనుకుంటారు. అయితే ఇది అపోహ మాత్రమే.
కన్నెపొర అనేది ఎప్పుడైనా, ఏ కారణం వల్లనైనా చిరిగిపోవచ్చు. ఎక్కువగా ఆటలు ఆడే సమయంలో, సైకిల్ తొక్కినప్పుడు, పీరియడ్స్ సమయంలో.. ఇలా ఏ కారణం చేతనైనా కన్నెపొర చిరిగిపోయే అవకాశం ఉంది. మొదటిరాత్రి లేదా మొదటి కలయికలో ఇలాంటిది జరగకపోతే కన్యత్వం లేదనుకోవడం కేవలం అజ్ఞానం మాత్రమే.
ఇంకా చెప్పాలంటే హైమన్ బాగా సాగే గుణం కలిగి ఉంటుంది. అది సందర్బాన్ని బట్టి తన స్వభావాన్ని చూపిస్తుంది. మొదటి కలయికలో కచ్చితంగా రక్తస్రావం జరగాలి అనుకుంటే.. అది ఆమెకు ఎంతో బాధాకరమైన అనుభవం అయి ఉంటుంది. తప్ప కన్యత్వానికి కొలమానం కాదు.
హస్త ప్రయోగం, టాంపోన్ల వాడడం వల్ల హైమన్ సాగి కన్యత్వం పోతుందనే అపోహ బాగా ప్రచారంలో ఉంది. కానీ ఇది వాస్తవం కాదు. కన్యత్వం అనేది మనసుకు సంబంధించిన విషయం. అన్నిరకాల లైంగిక ప్రక్రియల ద్వారా రతిక్రీడలో పాల్గొనడమే కన్యత్వానికి అర్థం. కాబట్టి యోనిలో ఏదో చొప్పించడం ద్వారా కన్యత్వం కోల్పోయారనే అపోహ సరికాదు.
గైనకాలజిస్టులు ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కన్యత్వ పరీక్షలు చేస్తారని, కన్యత్వాన్ని నిర్థారిస్తారనేది కూడా అపోహనే. హైమన్ ను పరిశీలించడం ద్వారా కన్యత్వాన్ని నిర్ణయించే శారీరక పరీక్ష ఇప్పటివరకు లేదు, ఎందుకంటే హైమన్ స్థితి ఒక్కటే కన్యత్వానికి సూచన కాదు.
గైనకాలజిస్టులు ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కన్యత్వ పరీక్షలు చేస్తారని, కన్యత్వాన్ని నిర్థారిస్తారనేది కూడా అపోహనే. హైమన్ ను పరిశీలించడం ద్వారా కన్యత్వాన్ని నిర్ణయించే శారీరక పరీక్ష ఇప్పటివరకు లేదు, ఎందుకంటే హైమన్ స్థితి ఒక్కటే కన్యత్వానికి సూచన కాదు.
రిలేషన్ షిప్ లో ఉండేవారు.. తాము కన్య? కాదా? అనే విషయం తన ప్రస్తుత భాగస్వామికి తెలిసిపోతుందేమో అనే ఆందోళనలో ఉంటారు. అయితే మీ హైమెన్ మీ కన్యత్వాన్ని బహిర్గతం చేయదు కాబట్టి మీరు అంతకు ముందు సెక్స్ చేశారా లేదా అనే విషయాన్ని మీ భాగస్వామి గుర్తించలేరు. అయితే, మీ లైంగిక చరిత్ర గురించి మీ భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీ మధ్య సాన్నిహిత్యం, నమ్మకం మరింత పెరగడానికి దోహదం చేస్తుంది.
మరో అపోహ.. కన్యత్వాన్ని కోల్పోయిన తర్వాత, సెక్స్ అంత పెద్ద విషయం కాదు అనేది. ఇది చాలా పాత మురికిపట్టిన అపోహ. ఇది ఎంతమాత్రం నిజం కాదు. సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు.. మనసుకు సంబంధించినది, ఫీలింగ్స్ కి సంబంధించినది.. కాబట్టి మీరు పూర్తి సంసిద్ధతతో ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అది మొదటిసారైనా, వందోసారైనా..
మీరు కన్యత్వం కోల్పోయారు కాబట్టి సెక్స్ కు ఎప్పుడంటే అప్పుడు రెడీ అనేది అస్సలు నిజం కాదు. రెండు ఆత్మలను కలిపే స్వచ్ఛమైన చర్య సెక్స్. కాబట్టి మీ మనసు నిజంగా ఎదుటివారిని కోరుకున్నప్పుడు.. మీ శరీర దాహం తీరాలనుకున్నప్పుడు మాత్రమే మీరు సెక్స్ ను పూర్తిస్తాయిలో ఎంజాయ్ చేయగలుగుతారు. దీనికి కన్యత్వానికి ఎలాంటి సంబంధం లేదు.