ఒత్తైన, నల్లని కురులకోసం అందమైన మందార పువ్వు.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

First Published May 25, 2023, 10:36 AM IST

జుట్టుకు మందార పువ్వును ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఈ పువ్వును సరైన మార్గంలో పెడితే చుండ్రు, డ్రైనెస్, హెయిర్ ఫాల్ వంటి జుట్టు సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. 
 

మందార పువ్వులు చూడటానికి అందంగా ఉంటాయి. అందుకే ఇవి ప్రతి ఇంటిముందు కనిపిస్తాయి. నిజానికి ఈ పువ్వులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ పువ్వును జుట్టుకు పెట్టడం వల్ల ఎన్నో జుట్టు సమస్యలన్నీ పోతాయి. అలాగే మీ  జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా మారుతుంది. మరి మందారను జుట్టుకు ఎలా పడితే ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

hibiscus flower

జుట్టు పెరుగుదలకు మందార హెయిర్ ఆయిల్

మందారం పేస్ట్ ను తీసుకుని కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడే నూనెలలో మరిగించాలి. ఇది శక్తివంతమైన హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. ఇందుకోసం 8-10 మందార ఆకులు, 4-5 పువ్వులు తీసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెను వేడి చేసి అందులో ఈ పేస్ట్ ను కలపండి. దీన్ని తలకు పట్టించి మసాజ్ చేయండి. ఈ మందారం హెయిర్ ఆయిల్ ను వారానికి 2-3 సార్లు వాడితే జుట్టు బాగా పెరుగుతుంది.

hibiscus flower

చుండ్రుకు మందారను ఎలా ఉపయోగించాలి

ఒకకప్పు మందార టీని తయారు చేసి చల్లారనివ్వండి. షాంపూ చేసిన తర్వాత టీని మీ జుట్టుకు పెట్టండి. దీనిని జుట్టుకు చివరి వాష్ గా ఉపయోగించండి. మందారంలోని సహజ ఆమ్లాలు మీ నెత్తిమీద, జుట్టు పిహెచ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఇది మీ జుట్టును మృదువుగా చేస్తుంది. ఈ వాష్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చుండ్రు  పూర్తిగా పోతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. 

hibiscus flower

జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మందార

మందార, ఉల్లిపాయ రసాన్ని కలిపి వాడితే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం మందార ఆకుల తాజా రసాన్ని ఉల్లిపాయ రసంతో మిక్స్ చేసి జుట్టుకు, తలకు అప్లై చేయండి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.
 

hibiscus flower

మెరుపు కోసం మందార వాటర్

1/4 కప్పు ఎండిన మందారం రేకులను 1.5 కప్పుల నీటిలో మరిగించండి. సుమారుగా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లారనివ్వండి. ఆ తర్వాత 1 టీస్పూన్ గ్లిజరిన్, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, లావెండర్ లేదా లైమ్ వంటి ఏదైనా  నూనెను దీనిలో ఐదు చుక్కలు వేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. రేకులను వడకట్టి మిశ్రమాన్ని శుభ్రమైన స్ప్రే సీసాలో పోయండి. పొడి జుట్టుపై, మూలాలు, చివరలపై నేరుగా స్ప్రే చేయండి. 1-2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. మీ జుట్టును షవర్ క్యాప్ తో కప్పి 1-2 గంటలు అలాగే ఉంచండి. షాంపూ చేసి మీ జుట్టును యథావిధిగా కండిషన్ చేయండి. బాటిల్ ను ఫ్రిజ్ లో ఉంచి 1-2 వారాల పాటు వాడండి. వారానికి 2-3 సార్లు దీన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

click me!