మెనుస్ట్రువల్ కప్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

First Published May 25, 2023, 9:44 AM IST

శానిటరీ ప్యాడ్ లతో పోలిస్తే మెనుస్ట్రువల్ కప్ లే మంచివని చాలా మంది చెబుతుంటారు. కానీ చాలా మంది మహిళలకు దీని గురించి పూర్తిగా తెలియదు. 
 

menstrual cup

పీరియడ్స్ సమయంలో ఆడవారు బ్లీడింగ్ గురించి టెన్షన్ పడుతుంటారు. అది ఎక్కడ లీక్ అవుతుందేమోనని. పనిచేసే, క్రీడల్లో పాల్గొనే ఆడవారు సాధారణంగా ప్యాడ్లు, టాంపోన్లు, మెన్స్ట్రువల్ కప్పులను వాడుతుంటారు. వీటిలో కొత్తది మెన్స్ట్రువల్ కప్. కానీ చాలా మంది ఆడవారికి ఈ కప్ గురించి పూర్తిగా తెలియదు. దీనిపై ఎన్నో అపోహలను నమ్ముతుంటారు. ఈ కప్పుల గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వీటి వాడకం పూర్తిగా సురక్షితమేనా?

మెన్స్ట్రువల్ కప్పులు సిలికాన్ తో తయారు చేయబడతాయి. దీనిని ఉపయోగించడం పూర్తిగా సురక్షితం. అయితే  ఈ కప్పులోని పదార్థం మీ శరీర కణజాలంతో స్పందించదని నిపుణులు చెబుతున్నారు. 
 

మెన్స్ట్రువల్ కప్పుల పరిమాణం, బ్రాండ్ ఉపయోగించాలి?

మార్కెట్ లో వివిధ రకాల బ్రాండ్లు అలాగే ఈ బ్రాండ్ల వివిధ పరిమాణాల మెన్స్ట్రువల్ కప్పులు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పరిమాణం, మంచి బ్రాండ్  గురించి మీరు తెలుసుకోవడానికి ఎన్నో బ్రాండ్లను ప్రయత్నించాలి. అలాగే ఎన్నో పరిమాణాలను ఉపయోగించండి. మీకు ఏది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందో దాన్నే ఉపయోగించండి. 
 

ఏ వయస్సులో ఉపయోగించడం సురక్షితం?

ఈ ప్రశ్న చాలా మంది వస్తుంటుంది. అసలు దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించొచ్చా? లేదా కొన్ని వయసుల వారే ఉపయోగించాలా అని.. నిపుణుల ప్రకారం..  మెన్స్ట్రువల్ కప్పులను ఏ వయస్సు వారైనా ఉపయోగించొచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు. దీనిని ఉపయోగించడం సౌకర్యవంతంగా అనిపించినంత వరకు దీనిని బేషుగ్గా ఉపయోగించండి. 
 

ఈ కప్పు పొత్తికడుపులోకి పైకి వెళుతుందా? 

యోని సుమారు 15 నుంచి 16 సెంటీమీటర్ల లోతులో ఉంటుంది. కాబట్టి మీరు దానిని లోపలికి నెట్టినా అది పొత్తికడుపులోకి వెళ్లదు. కాబట్టి ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. దీనిని ఎలాంటి భయం లేకుండా ఉపయోగించొచ్చు.
 

మెన్స్ట్రువల్ కప్ లోపల ఇరుక్కుపోతుందా?

ప్రతి మహిళ అడగాల్సిన ప్రశ్నల్లో ఇదొకటి అంటున్నారు నిపుణులు. స్టార్టింగ్ లో ఈ రుతుచక్ర కప్పును ఉపయోగించడం, బయటకు తీయడం మీకు కష్టంగా అనిపించొచ్చు. కానీ దీనిని బయటకు తీయడానికి సరైన మార్గం తెలిస్తే మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. 

దీనిని బయటకు తీసేటప్పుడు మీరు చేయవలసిన మొదటి పని బాగా శ్వాస తీసుకుని మిమ్మల్ని మీరు పూర్తిగా రిలాక్స్ గా ఉంచండి. ఆ తర్వాత యోని లోపల వేలిని పెట్టి కప్ ఎక్కడుందో తెలుసుకోండి. ఇప్పుడు దాని బేస్ ఒక వైపు నుంచి బయటకు లాగండి.

మెన్స్ట్రువల్ కప్పులు పెట్టి స్విమ్మింగ్, యోగా, ఆటలలో పాల్గొనొచ్చా?

నిపుణుల ప్రకారం.. మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగించి ఎలాంటి ఆటలోనైనా పాల్గొనొచ్చు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా శారీరక కార్యకలాపాలలో పాల్గొనొచ్చు. ఇది కాకుండా మెన్స్ట్రువల్ కప్పులు ఉన్నా నిద్రపోవచ్చు. కాకపోతే ఫస్ట్, సెకండ్ డే లీకేజీ ఉండొచ్చు. అందుకే ఆ సమయంలో వీటిని తరచుగా మారుస్తూ ఉండండి. ఎందుకంటే అధిక ప్రవాహం కారణంగా మీ రుతుస్రావ కప్పు లీక్ కావొచ్చు.
 

మెన్స్ట్రువల్ కప్పును ఎంతసేపు ఉంచొచ్చు?

సాధారణంగా వీటిని 12 గంటల పాటు ఉంచుకోవచ్చని బ్రాండ్లు పేర్కొంటున్నాయి. అయితే మెన్స్ట్రువల్ కప్పులను వాడటం మొదలు పెడితే 6 నుంచి 8 గంటల తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది మీ బ్లీడింగ్ పై ఆధారపడి ఉంటుంది.  బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే దీనిని తరచుగా మార్చాలి. బ్లీడింగ్ తక్కువగా ఉంటే దానిని ఎక్కువసేపు ఉంచొచ్చు.

click me!