ఈ ఒక్కటి చేస్తే.. బరువు తగ్గడం పక్కా..

First Published | Aug 4, 2024, 3:53 PM IST

మీరు సహజంగా, ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గాలనుకుంటే మాత్రం మెంతులను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోండి. అవును మెంతులు మీరు సులువుగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. 

ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇంచు బరువు తగ్గని వారు ఉన్నారు. అయితే వీళ్లు చేసే కొన్నితప్పులే బరువు తగ్గకుండా చేస్తాయి. కానీ మీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. వాటిలో మెంతులు ఒకటి. అవును మెంతులను ఉపయోగించి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ ఆకలి కానివ్వదు. దీంతో మీరు తీసుకునే కేలరీల మొత్తం తగ్గుతుంది. అంతేకాకుండా మెంతులు మీ జీవక్రియ రేటును పెంచుతాయి. ఇది శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. 

అంతేకాదు మెంతుల్లో యాంటీ ఒబేసిటీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడాన్ని పెంచి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు సహజ పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటే మాత్రం మెంతులను ఎన్నో విధాలుగా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 


మెంతి వాటర్ 

నేచురల్ గా బరువు తగ్గడానికి మీరు మెంతి వాటర్ ను తాగొచ్చు. ప్రతిరోజూ ఉదయం పరిగడుపున మెంతి వాటర్ ను తాగితే మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. మెంతులను నానబెట్టడం వల్ల దానిలో కరిగే ఫైబర్స్ విడుదలవుతాయి. ఇవి కడుపులో ప్రసరిస్తాయి. అలాగే  కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మీ ఆకలిని తగ్గిస్తాయి. మెంతి వాటర్ ను తయారుచేయడానికి ఒక గ్లాసు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే పరిగడుపున తాగండి.

మెంతి టీ

మెంతి నీరు కాకపోతే మీరు మెంతి టీని తాగొచ్చు. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ టీ తయారు చేయడానికి ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ గింజలను ఉడకబెట్టి వడకట్టి టీ తయారుచేసి తాగండి. 
 

మెంతి గింజల పొడి 

మీరు కావాలనుకుంటే మెంతులను పొడిగా చేసుకుని కూడా తినొచ్చు. మెంతి గింజల పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఆకలిని తగ్గించడానికి, జీవక్రియ రేటును పెంచడానికి బాగా సహాయపడుతుంది. మెంతి గింజల పొడిని తయారు చేయడానికి.. ముందుగా మెంతులను ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలలో కలిపి రెగ్యులర్ గా తాగాలి. 

fenugreek for weight loss

మెంతులు, తేనె పేస్ట్ 

సహజంగా బరువు తగ్గడానికి మెంతులు, తేనె మిశ్రమం కూడా బాగా సహాయపడుతుంది. తేనెలోని థర్మోజెనిక్ లక్షణాలు, మెంతుల్లో ఉండే ఫైబర్ మీ ఆకలిని తగ్గించడానికి, ఫుడ్ కోరికలను నియంత్రించడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఈ పేస్ట్ తయారు చేయడానికి ముందుగా మెంతులను నీటిలో కొన్ని గంటలు నానబెట్టండి. ఇప్పుడు నానబెట్టిన మెంతులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోండి. దీనిలో ఒక టీస్పూన్ తేనెను వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరిగడుపున తీసుకోండి.

Latest Videos

click me!