ఇలా చేస్తే వంటింట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు

First Published | Aug 4, 2024, 1:37 PM IST

ప్రతి వంటింట్లో బొద్దింకల బెడద ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ బొద్దింకలు ఎన్నో రోగాలకు దారితీస్తాయి. కాబట్టి వంటింట్లో బొద్దింకలు లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

బొద్దింకలు మీ ఇంట్లో ఉండకూడదంటే ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని వంటగదిని, ఇంటిని శుభ్రంగా ఉంచడం. ఎందుకంటే మురికి ఎక్కువగా ఉన్నచోటే ఇవి ఉంటాయి. కిచెన్ క్యాబినెట్స్ అయినా, ఓపెన్ అల్మారా ర్యాక్ లు అయినా వాటిపై ఉంచిన వార్తాపత్రికల కింద బొద్దింకలు గుడ్లు పెట్టి పెద్ద గుంపును తయారుచేస్తాయి. కాబట్టి ఇంట్లో బొద్దింకలను సులువుగా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వెనిగర్

వెనిగర్ వాసన బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా ప్రభావ వంతంగా ఉంటుంది. కాబట్టి సమాన పరిమాణంలో నీళ్లు, వెనిగర్ ను మిక్స్ చేయండి. ఈ నీటితో వంటగదిని శుభ్రం చేసి స్ప్రే బాటిల్ లో నింపి వంటగదిలోని ప్రతి మూలకు స్ప్రే చేయండి.


ఎసెన్షియల్ ఆయిల్

లావెండర్ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెల వాసనలు కూడా బొద్దింకలను తిప్పికొట్టడానికి బాగా పనిచేస్తాయి. కాబట్టి వాటిలో ఏదో ఒక నూనెను తీసుకుని అందులో కొన్ని చుక్కలను కొన్ని నీటిలో మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపి మూలల్లో స్ప్రే చేయండి.

cockroaches

కాఫీ గింజలు

కాఫీ గింజల ఘాటైన వాసన బొద్దింకలను ఆకర్షించే ఆహారాల వాసనను దాచిపెడుతుంది. దీంతో అవి ఆ ప్రదేశంలో వృద్ధి చెందవు. కాబట్టి బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో కాఫీ గింజలను ఒక డబ్బాలో వేసి ఉంచండి. 
 

వెల్లుల్లి

ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలున్న వెల్లుల్లి బలమైన వాసన బొద్దింకలను తరిమికొట్టడానికి బాగా సహాయపడుతుంది. అందుకే బొద్దింకలు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాల్లో వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. 
 

కిరోసిన్ నూనె

కిరోసిన్ నూనె వాసన ఇంట్లో వింత వాసనను కలిగించినా దీని వాసనకు బొద్దింకలు పారిపోతాయి. కాబట్టి కిరోసిన్ ను  స్ప్రే బాటిల్ లో నింపి, మంటలు రాకుండా ఉన్నప్పుడు స్ప్రే చేయండి. 
 


వేప,  కొబ్బరి నూనె

వేప, కొబ్బరి నూనెతో కూడా మీరు బొద్దింకలను తరిమికొట్టొచ్చు. ఇందుకోసం వేప ఆకులను ఎండబెట్టి పౌడర్ లా తయారు చేసుకుని అందులో కొన్ని చుక్కల కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి చిన్న చిన్న మాత్రలు తయారు చేసి అవి వచ్చే అవకాశం ఉన్న చోట ఉంచాలి.

Latest Videos

click me!