Hair Care: కోడిగుడ్డులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు పట్టుకుచ్చులా, సిల్కీగా మారడం పక్కా..!

Published : Sep 10, 2026, 02:57 PM IST

Hair Care: ఎంత ఖరీదైన షాంపూ, కండిషనర్లు వాడినా కూడా.., జుట్టు స్మూత్ గా మెరిసేలా కనిపించడం లేదా? అయితే, వెంటనే షాంపూలు మార్చేయకుండా.. కోడిగుడ్డును కొన్నింటితో కలిపి రాస్తే చాలు. మీరు కోరుకున్న జుట్టు మీ సొంతం అవుతుంది..

PREV
14
Hair Mask

కోడిగుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ కోడిగుడ్డు తినాలని మనకు డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే... ఇదే కోడిగుడ్డులోని ప్రోటీన్ జుట్టుకు పట్టులాంటి మెరుపు ఇస్తుంది. రెగ్యులర్ గా జుట్టు కుదుళ్లకు కోడిగుడ్డు సొన అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా, ఒత్తుగా, అందంగా కూడా మారుతుంది. అయితే.. దీనితో వచ్చిన సమస్య ఏంటంటే..చాలా మందికి కోడిగుడ్డు వాసన నచ్చదు. జుట్టు కూడా అదే వాసన వస్తుందని భయపడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు రాకుండా జుట్టు అందంగా పెరగాలంటే... కోడిగుడ్డును మరికొన్ని పదార్థాలతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం...

24
1. నిమ్మరసం - ఎగ్ ప్రోటీన్ మాస్క్

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ గుడ్డు నీచు వాసనను క్షణాల్లో మాయం చేసి, రిఫ్రెషింగ్ సువాసనను ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన జుట్టు స్మూత్ గా అందంగా పెరగడానికి సహాయపడుతుంది.

కావాల్సినవి: 1 గుడ్డు, 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ తేనె.

ఈ మాస్క్ జుట్టుకు ఎలా అప్లై చేయాలంటే... ముందుగా, కోడిగుడ్డు పగలకొట్టి బాగా కలపాలి. దానిలో నిమ్మరసం, తేనె కూడా వేసి బాగా కలపాలి. అన్నింటినీ బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి.

2. కొబ్బరి నూనె - వెనిలా షైన్ మాస్క్

కొబ్బరి నూనె జుట్టును డీప్ కండిషనింగ్ చేస్తే, వెనిలా ఎసెన్స్ గుడ్డు వాసన అసలు తెలియకుండా ఐస్‌క్రీమ్ లాంటి మంచి సువాసనను ఇస్తుంది. జుట్టు బాగా డ్రైగా ఉంటుంది అనుకున్నవారు ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయచ్చు.

కావాల్సినవి: 1 గుడ్డు సొన , 2 స్పూన్ల కరిగించిన కొబ్బరి నూనె, 3-4 చుక్కల వెనిలా ఎసెన్స్ (లేదా లావెండర్ ఆయిల్).

తయారీ,వాడే విధానం: గుడ్డు సొన, కొబ్బరి నూనె కలిపి అందులో వెనిలా ఎసెన్స్ వేయండి. తడి జుట్టుకు పట్టించి 25 నిమిషాల తర్వాత షాంపూ చేయండి. రెండు, మూడుసార్లు ఈ మాస్క్ వాడితే.. మీ జుట్టు స్మూత్ గా మారుతుంది.

34
పెరుగూ - దాల్చినచెక్క మాస్క్

పెరుగు జుట్టుకు మంచి షైన్ ఇస్తుంది. తేనె, దాల్చినచెక్క పొడి కలవడం వల్ల గుడ్డు నీచు వాసన అసలు రానే రాదు. ఈ హెయిర్ మాస్క్ జుట్టును అందంగా మారుస్తుంది.

1 గుడ్డు, 3 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ తేనె, పావు స్పూన్ దాల్చినచెక్క పొడి ఉంటే సరిపోతుంది. ఒక గిన్నెలో.. వీటిన్నింటినీ వేసి బాగా కలపాలి. స్మూత్ పేస్టులా కలిపి ఆ తర్వాత జుట్టుకు అప్లై చేసి తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా ఇలా చేస్తే.. మీ జుట్టు అందంగా కనపడుతుంది.

4. గ్రీన్ టీ - పిప్పర్‌మెంట్ రిఫ్రెష్ మాస్క్ 

గ్రీన్ టీ జుట్టుకు ప్రాణం పోస్తే, పిప్పర్‌మెంట్ ఆయిల్ తలకు చల్లదనాన్ని ఇస్తూ గుడ్డు వాసన కూడా రాదు. జుట్టును అందంగా మారుస్తుంది.

కావాల్సినవి: 1 గుడ్డు, 2 స్పూన్ల చల్లార్చిన గ్రీన్ టీ, 4 చుక్కల పిప్పర్‌మెంట్ ఆయిల్ .

తయారీ, వాడే విధానం: గ్రీన్ టీ, గుడ్డు కలిపి అందులో పిప్పర్‌మెంట్ ఆయిల్ వేసి, తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.

44
5. కాఫీ - అరటిపండు సిల్కీ మాస్క్..

అరటిపండు జుట్టును సాఫ్ట్‌గా మారిస్తే, కాఫీ పౌడర్ అత్యుత్తమ డీఓడరెంట్‌గా పనిచేసి గుడ్డు వాసనను పూర్తిగా పోగొడుతుంది.

కావాల్సినవి: 1 గుడ్డు, 1 పండిన అరటిపండు (మెత్తటి గుజ్జు), 1 స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పొడి.

తయారీ, వాడే విధానం: అరటిపండు గుజ్జులో గుడ్డు, కాఫీ పొడి వేసి బాగా కలపండి. జుట్టు మొత్తానికి పట్టించి 25 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.

అయితే, జుట్టుకు కోడిగుడ్డు హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా జుట్టును వేడి నీటితో కడగకూడదు. కేవలం చల్లటి నీటితోనే కడగాలి. అప్పుడే జుట్టు మృదువుగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories