ఖర్జూరం తినేసి గింజలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగించుకోండి

First Published Oct 5, 2024, 12:13 PM IST

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అయితే మనలో ప్రతి ఒక్కరూ ఖర్జూర పండును తినేసి దాని విత్తనాలను పనికిరావని పారేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి తెలుసా?

date seeds

ఖర్జూరాలు తీయగా, టేస్టీగా బలే ఏంటాయి. అంతేకాదు వీటిని తింటే మన ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని బరువు తగ్గడం నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడం వరకు ఎన్నో లాభాలు కలుగుతాయి. చాలా మంది ఖర్జూరాలను ఎక్కువగా డ్రైగా తింటుంటారు.

అయితే చాలా మంది ఖర్జూరాలను తినేసి వాటి లోపల ఉండే గింజలను పారేస్తుంటారు. ఎందుకంటే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని. కానీ ఖర్జూరాల గింజలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అవేంటంటే? 

date seeds

ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి : ఖర్జూర గింజలను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఖర్జూర గింజలను పొడిగా చేసి అందులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్,  తేనే వేసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. 

బాడీ స్క్రబ్:   ఖర్జూర గింజలను బాడీ బాడీ స్క్రబ్ గా కూడా వాడొచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరంలోని మృతకణాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇందుకోసం ఖర్జూరం గింజలను పొడిగా చేసి దాంట్లో పెరుగును వేసి పేస్ట్ లా చేయండి. దీన్ని శరీరానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి. 

బేకింగ్ లో ఉపయోగం:  కోకో పౌడర్ ను ఉపయోగించే వారు దాని ప్లేస్ లో  బేకింగ్ లో ఖర్జూర గింజలను ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా మాత్రం ఉపయోగించకూడదు. లిమిట్ లో ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని జరగదు. 

Latest Videos


జంతువులకు ఆహారంగా: ఖర్జూరం గింజలను వేయించి జంతువులకు ఆహారంగా కూడా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు గేదెలు, ఆవులు, గుర్రాలకు మేతగా ఉపయోగపడుతుంది. వీటిని తింటే ఈ జంతువుల ఎదుగుదల బాగుంటుంది. 

విత్తనాలతో కాఫీ: ఖర్జూర గింజలతో కాఫీని కూడా చేసుకుని తాగొచ్చు తెలుసా?ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ గింజల్లో కెఫిన్ కంటెంట్ మొత్తమే ఉండదు. దీంతో చేసిన కాఫీని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు.

ఈ కాఫీని తయారుచేయడానికి ఖర్జూరాలను ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్నినీళ్లలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టండి. ఇప్పుడు ఖర్జూరం సిరప్ దాల్చిన చెక్క, యాలకుల పొడి, వేడి పాలతో కాఫీని తయారుచేసుకోవాలి.

కంపోస్ట్:   ఖర్జూరం గింజలను మీరు మొక్కలకు కంపోస్ట్ కూడా కూడా వేయొచ్చు. ఇందుకోసం ఖర్జూరం గింజలను పగులగొట్టి పొడి చేయండి. దీన్ని మట్టిలో కలపండి. దీన్ని మొక్కలకు ఎరువుగా వేస్తే వాటికి మంచి పోషకాలు అందుతాయి. 

ఖర్జూరం విత్తనాలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఖర్జూర గింజల పొడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండెను, మెదడును  ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని కూడా రక్షిస్తుంది.

ఖర్జూరం గింజల పొడిలో ఉండే యాంటీ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే శరీర వాపును తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు. 

ఖర్జూర గింజల్లో కరిగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. ఈ గింజల పొడి ప్రేగు కదలికలను నియంత్రించడానికి, మలబద్దకం సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

ఖర్జూరం గింజల పొడిలో ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అంటే ఇది గుండెకు కూడా మేలు చేస్తుంది.  అంతేకాదు ఈ పొడిలో రకరకాల విటమిన్లు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 

ఖర్జూర గింజలు మీరు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఈ గింజల్లో  గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తక్కువగా ఉంటుంది. అంటే ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది.

వీటిని ఉపయోగించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకుండా చేయడంలో ఇవి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

ఖర్జూర విత్తనాల్లో ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో మీరు చాలా కాలం పాటు యవ్వనంగా ఉంటారు. 

click me!