అల్లం రసం తాగడం వల్ల ప్రయోజనాలు...
మనకు తెలిసినట్లుగానే.. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే... ప్రతిరోజు అల్లం రసం తాగితే.. శరీరంలో ఇంతకాలం పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లేలా చేస్తాయి. రోజూ అల్లం రసం తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు అజీర్ణం, గ్యాస్ , అజీర్తితో బాధపడుతుంటే, ప్రతిరోజూ మీ ఆహారంలో 2 టీస్పూన్ల అల్లం రసాన్ని చేర్చుకోండి.
అల్లంలో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ అల్లం రసం తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మారుతున్న కాలంలో ప్రతిరోజూ అల్లం రసం తాగితే, అది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు , దగ్గు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.