మొదటిసారి వంటకు మట్టిపాత్రలు వాడేప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

First Published | Aug 16, 2021, 4:19 PM IST

మట్టిపాత్రల్లో వండడం అంత సులభం కాదు. సమయం ఎక్కువ పడుతుంది. కాస్త జాగ్రత్తగా వండాలి. దాన్ని స్టౌ మీద అలా వదిలేస్తే కుదరదు. అటెన్షన్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. శుభ్రం చేసే విషయంలో కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. 

మట్టి కుండలలో వండిన ఆహారంలో పోషకాలు అధికంగా ఉంటాయి. రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు అందులోనే వంట చేసేవారు. ఆ తరువాతి కాలంలో స్టీలు, అల్యూమినియం పాత్రల రంగప్రవేశంతో మట్టి పాత్రల్లో వంట చేయడం పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే ఇటీవలి కాలంలో మట్టిపాత్రలు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. 

మట్టిపాత్రల్లో వండడం అంత సులభం కాదు. సమయం ఎక్కువ పడుతుంది. కాస్త జాగ్రత్తగా వండాలి. దాన్ని స్టౌ మీద అలా వదిలేస్తే కుదరదు. అటెన్షన్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. శుభ్రం చేసే విషయంలో కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మట్టిపాత్రల్లో వండడానికి అంతగా ఇష్టపడరు. అయితే మట్టిపాత్రల్లో వంట చేయడం వల్ల మీతోపాటు, మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Latest Videos


మట్టిపాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారం నాణ్యత పెరుగుతుంది. రుచి బాగుపడుతుంది. పోషకాలు సమతుల్యం అవుతాయి. అందుకే కాస్త కష్టమైనా మట్టిపాత్రల్లో వంట చేయడాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభం అవుతుంది.

మట్టి కుండల్ని వంటచేయాలంటే.. అన్ని రకాల కుండలు పనికిరావు. ఆ కుండల్ని కూడా శుభ్రం చేయడం ముఖ్యం. ముందుగా అది తెలుసుకోవాలి. దీనికోసం రెండు పద్ధతుల్ని చెఫ్ సంజీవ్ కుమార్ వివరించారు. ఒకటి వేడినీరు, మరొకటి గోధుమ పిండి.  రెండింటితో మట్టిపాత్రల్ని శుభ్రం చేసిన తరువాత ఉపయోగిస్తే మా పాత్రలు వంట చేయడానికి సిద్ధమయినట్టే. మరి ఆ పద్ధతులేంటో చూడండి.. 

వాడడానికి ముందుగా మట్టి పాత్రలను 8-10 గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. మట్టిపాత్రలకు అనేక సూక్ష్మ రంధ్రాలుంటాయి.  మట్టి కుండల్ని నీటిలో నానబెట్టినప్పుడు ఆ రంధ్రాలు పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆహారం ఆవిరి కాకుండా, వేడి నిలుపుకునేలా తయారవుతాయి. 8-10 గంటల తరువాత కుండను నీళ్లలోనుంచి తీసి కుండలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. కుండలో నీరు మరిగే వరకు ఉంచాలి. కాసేపటి తరువాత స్టౌ ఆపేసి, నీటిని తీసేసేయాలి. అంతే మీ కుండ వంటకు వాడుకోవడానికి సిద్ధమైనట్టే.  

ఇక ఇంకో విధానంలో గోధుమ పిండిని ఉపయోగించి కుండను వంటకు సిద్ధం చేస్తారు. కుండలో కొంచెం గోధుమ పిండి వేసి, కుండ లోపలి వైపు మొత్తం రుద్దాలి. దీనివల్ల కుండలో ఏదైనా మట్టిలాంటిది ఉంటే పోతుంది. ఇక పిండి దులిపేసి కుండను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. పిండి నల్లగా మారే వరకు వేడి చేయాలి. పిండి నల్లగా మారాక కుండను స్టౌ మీది నుంచి దించి, కాస్త చల్లారాక మస్లిన్ వస్త్రంతో శుభ్రం చేయాలి. అంతే మట్టిపాత్ర వంటకు సిద్ధమైనట్టే. 

మట్టి కుండలలో వంట చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అటువంటి పాత్రలను తయారు చేయడానికి ఉపయోగించే మట్టి ఆల్కలీన్, ఇది వంట ప్రక్రియలో ఆహారంలోని యాసిడ్ కంటెంట్‌ను తటస్థీకరిస్తుంది. సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే, మట్టి కుండలో వండిన ఆహారంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే, వంట చేసేటప్పుడు నూనె వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కుండలో ఉండే సహజమైన తేమ ఆహారాన్ని సరిగ్గా ఉడికించడానికి సరిపోతుంది.

click me!