అయితే, టవల్ తడిగా ఉంటే, మురికిగా ఉంటే.. దాన్నే మీరు తిరిగి ఉపయోగిస్తే, ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధిత సమస్యలను ఆహ్వానించనట్టే అవుతుంది. ఇక ఇంటిల్లిపాది ఒకే టవల్ ను వాడితే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. టవల్ ను ఎక్కువగా శుభ్రం చేయకపోవడం వల్ల, డెడ్ స్కిన్ టవల్ మీద పేరుకుపోయి, వాటిని తిరిగి వాడినప్పుడు మృత చర్మ కణాలు, సూక్ష్మజీవులు మీ చర్మానికి బదిలీ చేయబడి, ఫోలిక్యులిటిస్‌ను అడ్డుకుంటాయి.