Mango Store Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Published : May 31, 2022, 04:56 PM IST

Mango Store Tips: మామిడి పండ్లు కేవలం ఒక్క వేసవిలోనే పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా కొని తరచుగా తింటూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ ను పాటిస్తే మీరు కొన్న మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.   

PREV
110
Mango Store Tips: మామిడి పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..

జాతీయ ఫలమైన మామిడి (Mango) పండ్లు అన్ని పండ్లలో రారాజుగా పేరొందింది. ఈ పండ్లు కేవలం ఎండాకాలం (Summer)లోనే లభిస్తాయి. అందుకే సంవత్సరమంతా వీటి కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. ఇక ఈ పండ్లు  ఇష్టపడని వారంటూ ఉండరేమో. 

210
mango

ఇక మార్కెట్లలో చాలా రకాల మామిడి పండ్లు లభిస్తాయి. ఇక ఈ సీజన్ పోతే మళ్లీ రావని చాలా మంది 10 నుంచి 30 కిలల వరకు ఒకేసారి కొనేస్తుంటారు. కొనడం వరకు బాగానే ఉన్నా.. వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయడం మాత్రం కష్టమనే చెప్పాలి. అయితే కొంతమంది మామిడి పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలని ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ వీటిని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మామిడిలో ఉండే పోషకాలు. రుచి మొత్తం  పోతాయి. మరి మామిడి పండ్లను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం పదండి.

310
mango

మామిడి కాయలు లేద మామిడి పండ్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని ఫ్రిజ్ లో మాత్రం పెట్టకండి. వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల రుచి మొత్తం పోతుంది. అలాగే వీటిలో ఉండే పోషకాలు సైతం తగ్గిపోతాయి. వీటిని తిన్నా మీ శరీరానికి వచ్చే లాభాలేం ఉండవు. 

410

ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను కొన్నప్పుడు వాటిని గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయండి. దీనివల్ల మామిడి పండు రుచిగా ఉండటమే కాకుండా అవి మరింత తియ్యగా, మెత్తగా అవుతాయి. 

510
Mangoes

మంచిగ పండిన పండ్లను ఐదు రోజుల వరకు ఫ్రిజ్డ్ లో పెట్టొచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు. అలాగే గది ఉష్ణోగ్రత ఉంచిన మామిడి పండ్లను గంట సేపు ఫ్రిజ్ లో పెడితే చల్లగా అవుతాయి. 
 

610

మామిడి కాయలు త్వరగా పండ్లు కావాలంటే.. మామిడికాయలను ఒక బ్యాగ్ లో వేసి.. గడి ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. ఇలా చేస్తే అవి తొందరగా పండుతాయి. 

710
Mangoes

మామిడి పండ్లు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే.. వీటిని గాలి వెళ్లని ఒక కంటైనర్ లో పెట్టండి. దీనిని ఫ్రీజర్ లో పెట్టి 6 నెలల వరకూ స్టోర్ చేయొచ్చు. 
 

810

ఇక మామిడి పండ్లను ఇతర కూరగాయలు, పండ్లతో అస్సలు నిల్వ చేయకూడదు. వీటిని ఎల్లప్పుడూ సపరేట్ గానే నిల్వ చేయాలి. ఇలా చేస్తే టేస్ట్ పోతుంది. 
 

910

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. మామిడి పండ్లను తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ సంబంధిత సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కూడా పలు నివేదికలు వెల్లడించాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
 

1010
mango

చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. వీటిని తింటే ఎక్కడ బరువు పెరిగిపోతామేమోనని. ఇది పూర్తిగా అవాస్తవం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పలు పరిశోధనల్లో బరువు తగ్గడానికి సహాయపడే ఫైటోకెమికల్స్ కొవ్వు కణాలు మామిడి పండులో ఉన్నాయట. కానీ వీటిని మోతాదులోనే తీసుకోవాలి. 

 

click me!

Recommended Stories