Health Tips: ఉప్పు నీళ్ల లాభాలు తెలిస్తే.. వీటిని తాగకుండా అస్సలు ఉండలేరు తెలుసా?

Published : May 31, 2022, 03:58 PM IST

Health Tips: ఉప్పు నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. రెగ్యులర్ గా వీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.   

PREV
19
Health Tips: ఉప్పు నీళ్ల లాభాలు తెలిస్తే.. వీటిని తాగకుండా అస్సలు ఉండలేరు తెలుసా?

ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని అందరికీ తెలుసు. అలా అని దీనిని మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. షడ్రుచుల్లో ఒక్కటైన ఉప్పు వంటకు రుచిని తీసుకురావడమే కాదు.. ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు ఉప్పును తాగే నీళ్లలో కలుపుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు. మరి ఈ ఉప్పు నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

29

కాగ బెట్టిన నీటిలో కాస్త ఉప్పును వేసి పుక్కిలించడం లేదా మింగడం వల్ల గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అలెర్జీలు కూడా తగ్గిపోతాయట. కానీ అతిగా ఈ వాటర్ ను మింగితే మాత్రం డీహైడ్రేషన్ బారిన పడొచ్చు. 
 

39

జ్వరం, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా ఉప్పు నీరు బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలున్న వారు ఉప్పు నీటిని పుక్కిలిస్తే కొంతవరకు సమస్య తగ్గుతుంది. 
 

49

నోటి అల్సర్ సమస్యతో బాధపడేవారికి ఉప్పునీరు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఉప్పునీటిని నోటిలో పోసుకుని పుక్కిలించడం వల్ల అల్సర్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. 
 

59

ఈ వాటర్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధ్రుడంగా, బలంగా తయారవుతాయి. అలాగే ఎముకల పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. 

69

నిద్రలేమి సమస్యతో బాధపడేవారిక ఉప్పునీరు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఉప్పు నీటిని రోజంతా తరచుగా తాగితే నైట్ బాగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప్పు నీళ్లు ఒత్తిడిని కలిగించే హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మీరు తొందరగా నిద్రపోతారు. 

79

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సైనస్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఈ ఉప్పు నీరెంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుపడుతుంది. 

89

కావిటీ, చిగుళ్ల వాపు వంటి సమస్యలను తగ్గించడానికి ఉప్పు నీళ్లు ఎంతో సహాయపడతాయి. ఉప్పు నీటిని తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఇది నోటిలో దాగున్న బ్యాక్టీరియాను సైతం చంపేస్తుంది. 
 

99

బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉప్పు నీళ్లు చక్కగా ఉపయోగపడుతుంది.  ఓవర్ వెయిట్ ఉన్న వాళ్లు తరచుగా సాల్ట్ వాటర్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలు కూడా బయటకు పోతాయి. 

click me!

Recommended Stories