Fridge: ఫ్రిజ్ లో కోడిగుడ్లు, చికెన్, మటన్ ఎలా స్టోర్ చేయాలి? ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.?

Published : Nov 26, 2026, 05:19 PM IST

Fridge: పండ్లు, కూరగాయల దగ్గర నుంచి చికెన్, మటన్ వరకు అన్నీ ఫ్రిజ్ లోనే స్టోర్ చేస్తూ ఉంటాం. కానీ, ఫ్రిజ్ లో దేనిని ఎన్ని రోజులు స్టోర్ చేయాలి? ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? ఎలా స్టోర్ చేయాలి?

PREV
14
ఫ్రిజ్ లో మాంసం పెడుతున్నారా?

ఫ్రిజ్‌లో పెడితే చికెన్, మటన్, కోడిగుడ్లు ఎన్ని రోజులైనా పాడవకుండా తాజాగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే, చూడటానికి బాగానే ఉన్నా లోపల హానికరమైన బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆహార భద్రతా సంస్థ FSSAI సూచనలు, ఆహార నిపుణుల సలహాల ప్రకారం.. ఫ్రిజ్‌లో కోడిగుడ్లు, చికెన్, మటన్‌లను ఎలా స్టోర్ చేయాలి? ఎన్ని రోజుల్లో వాడేయాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

24
చికెన్ ఎలా స్టోర్ చేయాలి? ఎన్ని రోజులు ఉంటుంది?

మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చి చికెన్‌ను కవర్‌తో సహా నేరుగా ఫ్రిజ్ షెల్ఫ్‌లలో పెట్టకూడదు. చికెన్ నుంచి కారే రసం పండ్లు, కూరగాయలు లేదా వండిన ఆహారంపై పడితే బ్యాక్టీరియా వెంటనే వ్యాపిస్తుంది. అందుకే చికెన్‌ను శుభ్రంగా కడిగి, ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్‌లో అన్నింటికంటే కింది అరలో ఉంచాలి. సాధారణ ఫ్రిజ్‌లో (5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద) పచ్చి చికెన్‌ను 1 నుంచి 2 రోజులు మాత్రమే నిల్వ ఉంచాలి. అదే డీప్ ఫ్రీజర్‌లో అయితే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. వండిన చికెన్ కూరను అయితే ఫ్రిజ్‌లో 3 రోజుల లోపు వాడేయాలి.

34
మటన్ నిల్వ చేసే సరైన పద్ధతి..

మటన్ కూడా ఇతర ఆహార పదార్థాలకు తగలకుండా వేరుగా, మూత గట్టిగా ఉండే కంటైనర్‌లో స్టోర్ చేయాలి. మటన్ ముక్కలను చిన్న భాగాలుగా విడదీసి వేర్వేరు బాక్సులలో పెట్టుకుంటే, అవసరమైనంత మాత్రమే బయటకు తీసి వాడుకోవచ్చు. పచ్చి మటన్‌ను సాధారణ ఫ్రిజ్‌లో 3 నుంచి 5 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఒకవేళ డీప్ ఫ్రీజర్‌లో పెడితే 4 నుంచి 6 నెలల వరకు తాజాగా ఉంటుంది. వండిన మటన్ కూరను ఫ్రిజ్‌లో పెడితే 3 నుంచి 4 రోజుల్లో తినేయడం మంచిది.

44
కోడిగుడ్లను ఫ్రిజ్ డోర్‌లో పెడుతున్నారా?

చాలామంది కోడిగుడ్లను ఫ్రిజ్ డోర్‌కు ఉండే ట్రేలో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ డోర్ పదేపదే తెరిచి మూయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. గుడ్లు ఉష్ణోగ్రత మార్పులకు చాలా త్వరగా పాడవుతాయి కాబట్టి, వాటిని డోర్‌లో కాకుండా ఫ్రిజ్ లోపలి మధ్య అరలలో ఉంచడం ఉత్తమం. గుడ్లను ఎప్పుడూ కడిగి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే గుడ్డు పైనున్న సహజ రక్షణ పొర పోయి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. ఫ్రిజ్‌లో పెట్టిన పచ్చి కోడిగుడ్లను 3 నుంచి 5 వారాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను మాత్రం ఫ్రిజ్‌లో 5 నుంచి 7 రోజుల లోపు తినేయాలి.

ఫ్రిజ్ వాడకంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు..

బ్యాక్టీరియా వేగంగా పెరగకుండా ఉండాలంటే ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని FSSAI స్పష్టం చేస్తోంది. అలాగే డీప్ ఫ్రీజర్‌లో పెట్టిన చికెన్ లేదా మటన్‌ను వండటానికి ముందు బయట గది ఉష్ణోగ్రత వద్ద గంటల తరబడి వదిలేయకుండా, ముందు రోజు రాత్రే కింది ఫ్రిజ్ అరలోకి మార్చుకోవడం ఆరోగ్యానికి చాలా సురక్షితం.

Read more Photos on
click me!

Recommended Stories