ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసా?

Published : Apr 05, 2024, 02:51 PM IST

ఎండాకాలంలో ఫ్యాన్లు కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. ఫ్యాన్లు లేకుండా ఉక్కపోతకు ఉండటం కష్టమే. అయితే కొన్ని ఫ్యాన్లు తిరిగేటప్పడు గిర్ర గిర్ర ఒక్కటే సౌండ్ వస్తుంటుంది.  ఈ సౌండ్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.  

PREV
16
ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసా?

ఎండవేడికి ఇండ్లు నిప్పుల కుంపటిలా మారుతాయి. అందుకే వేడిని నుంచి ఉపశమనం పొందడానికి సీలింగ్ ఫ్యాన్లు లేదా ఫ్యాన్లను ఉపయోగిస్తుంటాం. అయితే కానీ ఒక్కోసారి ఫ్యాన్లు కారణం లేకుండా సౌండ్ చేస్తుంటాయి. ఈ సౌండ్ వల్ల నిద్రరాదు. చిరాగ్గా కూడా అనిపిస్తుంది. ఇలా ఫ్యాన్లు సౌండ్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ సీలింగ్ ఫ్యాన్ కూడా ఇలాగే సౌండ్ చేస్తుందా? అయితే దానికి కారణాలు, అలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26

నూనె వేయండి 

మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ మరీ ఎక్కువ శబ్దం చేస్తుంటే.. అందులో కొద్దిగా నూనె వేయండి. ఫ్యాన్ కు నూనె వేయడం వల్ల గిర గిర సౌండ్ రావడం తగ్గుతుంది. అలాగే ఫ్యాన్ స్పీడ్ గా, సాఫీగా నడుస్తుంది. ఫ్యాన్ సౌండ్ ను ఆపేయడంలో నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నట్లు బిగుసుకుపోయినప్పుడు లేదా తప్పు పట్టినప్పుడు ఇలా సౌండ్ వస్తుంది. నూనెతో సమస్య పరిష్కారమవుతుంది.
 

36

దుమ్ము, ధూళి
 
ఇంట్లోకి దుమ్ము, ధూళి రావడం చాలా కామన్. కానీ మనం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను శుభ్రం చేసిన విధంగా ఫ్యాన్లను శుభ్రం చేయం. ఏ ఐదారేండ్లకు ఒకసారో ఫ్యాన్లను క్లీన్ చేస్తుంటారు. కానీ ఫ్యాన్లకు పట్టే దుమ్ము, ధూళి వల్ల సీలింగ్ ఫ్యాన్ స్లో అవుతుంది. అలాగే శబ్దం కూడా చేస్తుంది. ఇలా కాకూడదంటే ఫ్యాన్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
 

46

బ్లేడ్ లను శుభ్రం చేయాలి

ఫ్యాన్ పై దుమ్ము, ధూళి చాలా త్వరగా పేరుకుపోతుంది. దీనివల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరగదు. అలాగే ఫ్యాన్ కూడా శబ్దం చేయడం ప్రారంభిస్తుంది. అందుకే వీలు చూసుకుని ఫ్యాన్  బ్లేడ్లను శుభ్రం చేస్తుండాలి. అలాగే ఫ్యాన్ ను బాగా బిగించాలి. దీనివల్ల సౌండ్ రాదు. 
 

56

నట్ బోల్ట్ లను చెక్ చేయండి 

వానాకాలం, చలికాలంలో ఫ్యాన్లను అస్సలు ఆన్ చేయరు. వీటివల్ల ఫ్యాన్ లు చాలా కాలం పాటు ఆఫ్ లోనే ఉంటాయి. చాలా కాలం తర్వాత వీటిని ఆన్ చేయడం వల్ల కూడా ఫ్యాన్ లు శబ్దం చేస్తుంటాయి. ఇలాంటప్పుడు ఫ్యాన్ నట్ బోల్ట్ లను ఒకసారి చెక్ చేయండి. అలాగే వాటికి కొద్దిగా నూనె వేయండి. ఇది యంత్రం బాగా పనిచేసేలా చేస్తుంది.
 

66

ఫ్యాన్ బేరింగ్

మీ సీలింగ్ ఫ్యాన్ చాలా పొడవుగా ఉంటే దాని బారింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల సీలింగ్ ఫ్యాన్ లో ఎన్నో సమస్యలు  వస్తాయి.  అందుకే మీ ఫ్యాన్ ఎక్కువ శబ్దం చేస్తుంటే మీకు కాకుండా ఎలక్ట్రీషియన్ ను పిలిపించి చూపించండి. 

click me!

Recommended Stories