చాణక్య నీతి ప్రకారం.. మీ బాధను వీళ్లతో మాత్రం చెప్పుకోకండి

Published : Apr 05, 2024, 02:04 PM IST

బాధలు, కష్టాలు, దుఖాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే మన బాధను వేరేవాళ్లకు చెప్పుకుంటుంటాం. అయితే చాణక్య నీతి ప్రకారం.. మన బాధను కొంతమంది వ్యక్తులకు మాత్రం చెప్పుకోకూడదు. వాళ్లు ఎవరంటే? 

PREV
15
చాణక్య నీతి ప్రకారం.. మీ బాధను వీళ్లతో మాత్రం చెప్పుకోకండి

కష్టమొచ్చినా, సంతోషమొచ్చనా ఎవరో ఒకరికి చెప్పుకుంటుంటాం. కొందరు ఫ్రెండ్స్ కు చెప్తే, మరికొందరు తెలిసిన వాళ్లకు, బంధువులకు చెప్తుంటారు. కానీ ఆచార్య చాణక్యుడి ప్రకారం.. జీవితంలో బాధలను, సమస్యలను కొందరితో పంచుకోకూడదు. ఇలా చెప్తే మీ సమస్యలు మరింత పెరుగుతాయి. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మన కష్టాలను ఎవరితో చెప్పుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

అందరితో స్నేహంగా ఉండేవారు

ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ లేని వ్యక్తులు ఎవరూ ఉండరు. చాలా మంది బాధను ఫ్రెండ్స్ కే ముందు చెప్తుంటారు. దీనిలో తప్పు లేదు. కానీ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఫ్రెండ్ గా ఉండే వారికి మాత్రం మీ బాధలను ఎప్పుడూ చెప్పుకోకండి. కొంతమంది అందరితో స్నేహంగా ఉండాలనుకుంటారు. అది కూడా కొంతకాలమే. కానీ వీళ్లను నమ్మడానికి లేదు. ఇలాంటి వాళ్లు మీరు చెప్పుకున్న బాధలను, సీక్రేట్స్ ను ఇతరులకు చెప్తారు. అందుకే కొన్ని రోజులే మీతో ఫ్రెండ్ షిప్ ను ఏర్పరుచుకునే వారికి మీ బాధలను చెప్పకండి. 
 

35

ఎగతాళి చేసే వ్యక్తులు

ఎప్పుడైనా సరే ఎగతాళి చేసేవారిని మాత్రం నమ్మకూడదు. ప్రతి విషయాన్ని జోక్ గా తీసుకునే వ్యక్తులు మీ సమస్యలను మరింత పెంచుతారే తప్ప మీ బాధలను తీర్చరు. మీరు భావోద్వేగానికి గురై మీ బాధలను ఇలాంటి వాళ్లతో పంచుకుంటే వీళ్లు మీ బాధను ఇతరులకు చెప్తారు. మిమ్మల్ని మరింత ఎగతాళి చేస్తారు. అందుకే ప్రతి విషయాన్ని ఎగతాళి చేసే వారితో మాత్రం మీ బాధలను చెప్పుకోకండి. 
 

45


స్వార్థపరులు

స్వార్థపరుసులు తమ బాధలను తప్ప మరెవరి  బాధలను పెద్దగా పట్టించుకోరు. తమ జీవితమే అందంగా ఉండాలనుకుంటారు. ప్రతి విషయంలోనూ తమ ప్రయోజనాన్నే చూస్తారు. ఈ లక్షణం ఉన్నవారు ఇతరులకు హాని చేయకుండా ఉండలేరు. సమయం వచ్చినప్పుడు మీరు చెప్పేదాన్ని వారి స్వప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకుంటారు. అందుకే స్వార్థపరులకు మీ విషయాలను ఎట్టిపరిస్థితిలో చెప్పకండి. 
 

55

చిరాకు

కొందరికి ఎప్పుడూ అభద్రతా భావం ఉంటుంది. ఇలాంటి వారికి మీరు బాధలు చెప్తే చిరాకు కలుగుతుంది. అలాగే కొన్నికొన్ని సార్లు మీపై అసూయ కూడా కలగొచ్చు. అలాగే మీకు చెడు కూడా చేయొచ్చు. ఇలాంటి వారికి మీరు బాధలు చెప్తే వారు ఆనందపడతారు. అందుకే ఇలాంటి వారికి మీ బాధలను మాత్రం చెప్పకండి. 

click me!

Recommended Stories