బ్రోకలీ:
ఆరోగ్యకరమైన కూరగాయలలో బ్రకోలీ కూడా ఒకటి. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బ్రోకలీలో ఉండే లక్షణాలు చిగురువాపును తగ్గిస్తాయి. అలాగే, దంతాల పసుపును తొలగించడంలో కూడా సహాయపడతాయి.
పాల ఉత్పత్తులు:
దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం చాలా ముఖ్యమైనది. అందువల్ల కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల దంతాల తెల్లదనాన్ని కాపాడుతుంది. దంతాల పసుపును తొలగించడానికి, మీరు పాలు, పెరుగు, జున్ను తినాలి. ఇందులో ఉండే పోషకాలు దంతాల పసుపు కలర్ ను తొలగించడంలో సహాయపడతాయి.