వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి బారిన పడిన వారికి అకస్మత్తుగా విపరీతమైన జ్వరం వస్తుంది. అలాగే కొన్నిసార్లు జ్వరంతో పాటుగా వణుకు కూడా రావొచ్చు. భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, మోకాలి కింద నొప్పి, వెన్నునొప్పి, కళ్లు ఎర్రబడటం, కామెర్లు, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కామెర్లతో పాటుగా విపరీతమైన జ్వరం వస్తే అది ఎలుకల జ్వరంగా అనుమానించాలి. కామెర్లు, ఆకలి లేకపోవడం, మైకము, వాంతులు కూడా అవుతాయి. కొంతమందికి కడుపు నొప్పి, వాంతులు, మగత, చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.