కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే ఈ మూడు జ్యూస్ లను తప్పక తాగండి.. కొద్ది రోజుల్లోనే రాళ్లు తొలగిపోతాయి..

Published : Apr 04, 2022, 12:08 PM IST

Kidney stone: కిడ్నీల్లో రాళ్లను తొలగించేందుకు టమాటా జ్యూస్, నిమ్మరసం, తులసి రసం ఎంతో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఇట్టే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

PREV
16
కిడ్నీల్లో రాళ్లు పోవాలంటే ఈ మూడు జ్యూస్ లను తప్పక తాగండి.. కొద్ది రోజుల్లోనే రాళ్లు తొలగిపోతాయి..

కిడ్నీల్లో పొటాషియం, కాల్షియం , సోడియం, ఇతర ఖనిజాలు పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడుతాయి. కొన్ని సమయాల్లో ఈ రాళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ సమస్య అంత తొందరగా బయటపడదు. అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు విపరీతమైన నొప్పి పుడుతుంది. 

26

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే పొత్తికడుపు తో పాటుగా వెనకభాగంలో కూడా చాలా నొప్పి పుడుతుంది. ఒక్కోసారి వాంతులు, వికారంగా అనిపిస్తుంది. కొన్నికొన్ని సార్లు మూత్రంలో రక్తం కూడా వస్తుంటుంది. అలాగే ఉన్నటుండి జ్వరం రావడం, విపరీతంగా చెబట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 

36

అయితే కిడ్నీల్లో రాళ్లను మెడిసిన్స్ తోనే కాదు కొన్ని రకాల జ్యూస్ లతో కూడా తొలగించొచ్చు. ఈ జ్యూస్ లతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంతకి ఏయే జ్యూస్ లను తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

46

టొమాటో జ్యూస్..  కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి టమాటో జ్యూస్ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం రెండు టొమాటోలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పును, మిరియాల పౌడర్ ను వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్ ను అప్పుడే లేదా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తాగొచ్చు.
 

56

నిమ్మరసం.. నిమ్మపండులో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రాళ్లను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఒక గిన్నెలో కొంచెం పెరుగును తీసుకుని అందులో టీ స్పూన్ నిమ్మరసం, రుచికి తగ్గ ఉప్పును వేసి బాగా కలగలపాలి. దీన్ని తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఇట్టే తొలగిపోతాయంట. 

66

తులసి రసం.. తులసి ఆకులతో తయారుచేసిన జ్యూస్ కూడా కిడ్నీల్లో రాళ్లను తొలగించగలదు. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకుని రసాన్ని తీసిపెట్టుకోవాలి. ఆ రసంలో టీ స్పూన్ తేనెను మిక్స్ చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో తాగాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి చాలా తొందరగా బయటపడొచ్చు. 


 

click me!

Recommended Stories