Milk Side Effects:వామ్మో.. పాలు ఎక్కువ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా..?

Published : Apr 04, 2022, 10:40 AM IST

Milk Side Effects: అవసరమైన దాని కంటే పాలను రోజులో ఎక్కువ తాగితే.. గుండె సంబంధిత రోగాలు, జీర్ణ సమస్యలు, సోమరితనం, అలసట,  చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..

PREV
18
Milk Side Effects:వామ్మో.. పాలు ఎక్కువ తాగితే ఇన్ని సమస్యలొస్తాయా..?

Milk Side Effects: పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో మనందరికీ తెలిసిందే. పాలల్లోకాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా, ధ్రుడంగా తయారవుతాయి. ఇక ప్రోటీన్ గురించి చెప్పుకున్నట్టైతే.. ఇది ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

28

ప్రతి రోజూ పాలను తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి హెయిర్ ఫాల్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటుగా జుట్టు పొడుగ్గా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 

38

పాలలో చిటికెడు పసుపు , అల్లం వేసుకుని తాగితే గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు తగ్గడమే కాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాలలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రిస్తుంది. పాలతో గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. అలా అని పాలను మోతాదుకు మించి మాత్రం తీసుకోకూడదు. 

48

పాలను నిత్యం ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం. 

58

జీర్ణసమస్యలు.. పాలను అవసరానికి మించి తాగడం వల్ల జీర్ణక్రియ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలను మోతాదుకు మించి తాగితే అజీర్థి  సమస్య వస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రావొచ్చు. కాబట్టి పాలను మోతాదులోనే తాగండి. 

68

అలసట, సోమరితనం.. పాలను మితిమీరి తాగితే నీరసం, అలసట, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు చుట్టుకోవచ్చు. పాలను ఎక్కువగా తాగితే ఇందులో ఉండే  A1 కేసైన్  మూలకం పేగుల్లో మంటను పుట్టిస్తుంది. అంతేకాదు ఇది పేగుల్లో బ్యాక్టీరియా సంఖ్యను కూడా పెంచుతుంది. 

78

చర్మ సమస్యలు.. నిత్యం పాలను ఎక్కువగా తాగడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాలను ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల ఇందులో ఉండే కొవ్వులు ముఖంపై మొటిమలు ఏర్పడేలా చేస్తాయి. 
 

88

గుండె సంబంధిత సమస్యలు.. రోజుకు రెండు మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలను తాగకూడదని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తాగితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. కాబట్టి పాలను తాగేముందు రోజుకు ఎన్ని పాలను తాగాలో వైద్యుడి సలహాలు తీసుకోండి. 

 

click me!

Recommended Stories