మనం నిమ్మకాయ, వెనిగర్, ఉప్పు,యాంటాసిడ్లు, వాషింగ్ పౌడర్ లాంటివి ఉపయోగించి మనం ఎలాంటి మరకలను అయినా తొలగించవచ్చు. ముందుగా.. దుస్తులకు అంటుకున్న హోలీ రంగులను నీటితో ఉతకడానికి ప్రయత్నించండి. నీటిలో జాడించిన తర్వాత కూడా మరకలు అలానే ఉన్నాయి అంటే..నిమ్మకాయను వాడొచ్చు. ఒక గిన్నెలో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. దాంట్లో ఉప్పు, వెనిగర్ కూడా వేసి బాగా కలపాలి. ఇందులోనే వాషింగ్ పౌడర్, ఈనో కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని నీటిలో వేసి.. ఆ నీటిని మరిగించాలి.