Blood Group: మీ బ్లడ్‌ గ్రూప్‌ ఏంటి.? దీనిబట్టి మీకు ఎలాంటి వ్యాధులు వస్తాయో చెప్పొచ్చు.

Narender Vaitla | Published : Mar 13, 2025 2:35 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేయడం ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. ఎన్నో రకాల జీవ క్రియలకు రక్తం ప్రధాన వనరుగా పనిచేస్తుంది. మరి బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా మన ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని మీకు తెలుసా.?   

15
Blood Group: మీ బ్లడ్‌ గ్రూప్‌ ఏంటి.? దీనిబట్టి మీకు ఎలాంటి వ్యాధులు వస్తాయో చెప్పొచ్చు.

శరీరంలో రక్తం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన ఊపిరితిత్తులు లోపలికి తీసుకునే ఆక్సిజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికీ చేరవేస్తుంది. అలాగే మనం తినే ఆహారంలోని పోషకాలు (విటమిన్లు, ఖనిజాలు, గ్లూకోజ్) రక్తం ద్వారా అన్ని అవయవాలకు చేరుతాయి. రక్తంలోని వైట్ బ్లడ్ సెల్స్ (WBC) శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ల నుండి కాపాడుతాయి. రక్తంలోని ప్లేట్లెట్ల వల్ల గాయాల సమయంలో రక్తస్రావం ఆగుతుంది. 
 

25

ఇలాంటి ముఖ్యమైన రక్తం సరిపడా లేకపోతే శరీరానికి ఆక్సిజన్, పోషకాలు అందవు. ఈ కారణంగా అవయవాలు పనిచేసే అవకాశాలు ఉండవు. తీవ్రమైన రక్తనష్టం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా రక్తాన్ని A, B, AB, O గ్రూపులుగా విభజిస్తారు. అయితే ఇందులో పాజిట్‌, నెగిటివ్‌ అనే ఉప విభాగాలు కూడా ఉంటాయి. వీటిలో 'ఓ' గ్రూప్‌ వాళ్లను విశ్వదాతలుగా చెబుతుంటారు. వీరి ఎవరికైనా రక్తాన్ని ఇవ్వొచ్చు. అలాగే AB బ్లడ్‌ గ్రూప్‌ వారిని సార్వత్రిక గ్రహీతలుగా చెబుతుంటారు. వీరికి ఎవరైనా రక్తం ఇవ్వొచ్చు. 
 

35

'O' బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారిలో కనిపించే వ్యాధులు: 

అయితే మన రక్తం గ్రూప్‌ ఆధారంగా మనకు వచ్చే వ్యాధులు మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. 'O' బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని అంటారు. అయితే, వీరికి అల్సర్లు, థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే గాయాల సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

'A' బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారిలో: 

ఈ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్‌, వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. 
 

45
Research says THIS blood type is most at risk for heart disease- what's your blood group

'B' బ్లడ్‌ గ్రూప్‌:

B బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. 

AB బ్లడ్‌ గ్రూప్‌: 

ఈ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి జ్ఞాపకశక్తి సమస్యలు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

55

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి: 

అయితే బ్లడ్‌ గ్రూప్‌ ఆధారంగా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనడంలో నిజం ఉన్నా.. బ్లడ్‌ గ్రూప్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి చేయడం అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!