బియ్యానికి, పప్పులకు, కారానికి పురుగులు పట్టొదంటే ఏం చేయాలి?

First Published Jun 20, 2024, 11:53 AM IST

మళ్లీ మళ్లీ షాపుల చుట్టూ ఎవరు తిరుగుతారని ఆడవారు ఓకే సారి ఎక్కువ మొత్తంలో కిరాణా సరుకులను కొంటుంటారు. అయితే చాలా రోజులు నిల్వ ఉండేసరికి బియ్యం, పప్పులు, కారం పొడితో పాటుగా మసాలా దినుసుల్లో కూడా పురుగులు పడుతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
 

ఆడవాళ్లు వంటింట్లో ఏ ఒక్కటీ మిస్ కాకుండా చూసుకుంటారు. ముఖ్యంగా షాపుల చుట్టూ పదే పదే తిరగకుండా.. బయటకు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో వంటింట్లోకి కావాల్సిన కిరాణా సరుకులన్నింటినీ కొనేస్తుంటారు. కానీ ఇలా ఒకేసారి సరుకులను ఎక్కువగా కొనడం వల్ల వాటిలో పురుగులు పడుతుంటాయి. 

ముఖ్యంగా పురుగులు బియ్యం, పప్పులు, డ్రై ఫ్రూట్స్, కారం పొడి వంటి వంటింటి సామాగ్రిపై ఎక్కువగా దాడిచేస్తుంటాయి. పురుగులు పట్టిన పప్పులను తినలేక డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అంతేకాకుండా ఈ పురుగులు వంటింట్లో ఉన్న ఇతర సామాగ్రిపై కూడా దాడిచేస్తుంటాయి. అందుకే  బియ్యం, పప్పులతో పాటుగా ఇతర ఆహార పదార్థాలకు కీటకాలు, పురుగులు పట్టకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బియ్యానికి పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలి? 

కొబ్బరి చిప్ప బియ్యానికి పురుగులు పట్టకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అవును బియ్యం సంచిలో బాగా ఎండిన కొబ్బరి చిప్పను పెడితే వాటిలోకి కీటకాలు, పురుగులు రావు. దీంతో మీ బియ్యం పాడవకుండా ఉంటాయి. 

sugar

చక్కెర

ఇంట్లో చక్కెరను ఏ మూలన పెట్టినా చీమలు అక్కడి రాకుండా ఉండవు. సాధారణంగా చాలా మంది ఇండ్లలో చక్కెర డబ్బాల్లో చీమలు గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే చక్కెరకు చీమలు పట్టకూడదంటే 3 నుంచి 4 లవంగాలను తీసుకుని చక్కెర డబ్బాలో వేయండి. ఎందుకంటే లవంగాల వాసన చీమలకు అస్సలు నచ్చదు. దీంతో చీమలు చీరలోంచి పారిపోతాయి. 
 

కారం పొడి

కారంపొడికి కూడా పురుగులు, కీటకాలు పడుతుంటాయి. ముఖ్యంగా వీటిలో తెల్ల పురుగు ఎక్కువగా ఉంటుంది. పురుగులు పట్టిన కారం పొడి డస్ట్ బిన్ పాలే అవుతుంది. అందుకే కారం పొడికి కీటకాలు పట్టకుండా చూసుకోవాలి. అయితే ఎండుమిర్చి పొడిలో కొద్దిగా ఉప్పు కలిపితే పురుగులు, కీటకాలు దానిలోకి అస్సలు రావు. 

కందిపప్పు

కండిపప్పు, మినపప్పుకు పురుగులు ఎక్కువగా పడుతుంటాయి.  ఈ పప్పులకు పురుగులు పట్టకూడదంటే దానిలో ఐదు ఎండుమిర్చిని వేయండి. ఎండుమిరపకాయల ఘాటుకు పురుగులు అస్సలు రావు. 
 

Latest Videos

click me!