పచ్చి కొబ్బరిని తింటే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Oct 25, 2024, 12:42 PM IST

పచ్చి కొబ్బరిని అలాగే తినడంతో పాటుగా పచ్చడి, రకరకాల కూరలు చేసుకుని తింటుంటారు. కానీ పచ్చి కొబ్బరిని తింటే ఏమౌతుందో తెలుసా? 

పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని రోజువారి కూరల్లో వేస్తుంటారు. అలాగే పచ్చడి చేసుకుని తింటుంటారు. చాలా మంది పచ్చి కొబ్బరిని ఒక మసాలా దినుసుగా కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా రకాల వంట్లో ఉపయోగిస్తుంటారు. 
 

కొబ్బరి ఒక్క టేస్ట్ కు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోపడుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్, మాంగనీస్, సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అసలు పచ్చి కొబ్బరిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పచ్చి కొబ్బరిలోని పోషక విలువలు

కేలరీలు: 160, సోడియం: 9 మి.గ్రా ,  కార్బోహైడ్రేట్లు: 6.8 గ్రా ,  ఫైబర్: 4 గ్రా , చక్కెరలు: 2.8 గ్రా,  ప్రోటీన్: 1.5 గ్రా, పొటాషియం: 160 మి.గ్రా, మాంగనీస్: 0.68 మి.గ్రా, సెలీనియం: 4.5 ఎంసిజి లు ఉంటాయి. 

పచ్చి కొబ్బరిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పచ్చి కొబ్బరిలో గాలిక్ ఆమ్లం, సెలీనియం,  కెఫిక్ ఆమ్లంతో పాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ శక్తివంతమైన సమ్మేళనాలు మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.

అలాగే శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల నుంచి మన శరీరాన్ని దూరంగా ఉంచుతాయి. వీటితో పోరాడే సామర్థ్యాన్ని కూడా అందిస్తాయి. 
 


మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

పచ్చి కొబ్బరిలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను కూడా బాగా పెంచుతుంది.

దీంతో మలం పేగుల గుండా సాఫీగా ముందుకు కదులుతుంది. పచ్చి కొబ్బరిలోని ఫైబర్ మలం సున్నితంగా తరలడానికి సహాయం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మలబద్దకం సమస్యకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. 

రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది

కొబ్బరిలో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది మన శరీరం నుంచి అదనపు సోడియాన్ని తొలగించడానికి ఎఫెక్టీవ్ గా సహాయపడే ఒక ముఖ్యమైన ఖనిజం.

ఇది రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఇది అకస్మత్తుగా బీపీ పెరిగే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 
 

అకాల వృద్ధాప్యాన్ని నివారించొచ్చు

పచ్చి కొబ్బరిలో గాలిక్, కెఫిక్, సెలీనియం, కౌమరినిక్ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేస్తే ఫ్రీరాడికల్స్ ను తటస్తం చేస్తాయి.

పచ్చి కొబ్బరిని తినడం వల్ల అకాల వృద్ధాప్యం మందగించడం, చర్మంపై ముడతలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

పచ్చి కొబ్బరి డయాబెటీస్ లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందో ఇది కార్బోహైడ్రేట్ శోషణను తగ్గిస్తుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పచ్చి కొబ్బరిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరిగే ప్రమాదం ఉండదు. పచ్చి కొబ్బరి డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి ఆరోగ్యకరమైన గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించాలనుకునే వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

పచ్చి కొబ్బరిని తినడం వల్ల వచ్చే సమస్యలు 

కొబ్బరిలో కేలరీలు, కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అలాగే గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి పచ్చి కొబ్బరిని ఎప్పుడూ కూడా ఎక్కువగా తినకూడదు. లిమిట్ లో తింటేనే దీని ప్రయోజనాలను పొందుతారు. మీకు అలెర్జీ గనుక ఉంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే పచ్చి కొబ్బరిని తినండి.
 

Latest Videos

click me!