సాంబార్ మసాలాను ఇలా ఇంట్లోనే తయారుచేయండి.. టేస్ట్ కూడా బలే ఉంటుంది.

First Published | May 9, 2022, 9:36 AM IST

సాంబార్ మసాలా చాలా వంటలకు రుచిన పెంచడమే కాదు .. కమ్మని వాసనను కూడా అందిస్తుంది. అందుకే చాలా మంది దీనిని అన్ని వంటల్లో వేస్తుంటారు. అయితే ఈ సాంబర్ మసాలాను ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే..
 

మసాలాలు వంటలకు మంచి టేస్టీని తీసుకొస్తాయి. అందుకే చాలా మంది ప్రతి వంటలోనూ మసాలాలను వేస్తుంటారు. ముఖ్యంగా సాంబర్ మసాలా అయితే బలే టేస్టీగా ఉంటుంది. 

సాంబర్ తో పాటుగా.. వీటిని ఇడ్లీ, వడ, దోశ వంటి సాంబార్ లో కూడా ఈ మసాలాను వేస్తుంటారు. అందుకే సాంబార్ అంత టేస్టీగా  తయారవుతుంది. అందుకే చాలా మంది ఈ సాంబార్ మసాలాను ఇంట్లోనే ట్రై చేస్తుంటారు. కానీ  టేస్టీగా కాదు. ఎందుకంటే వీటిలో ఏది ఎప్పుడు వేయాలి..ఎలాంటి మసాలా దినుసులను ఉపయోగించాలో తెలిసి ఉండదు. అయితే ఈ మసాలాను బయట మార్కెట్ లో లభించే మసాలా పౌడర్ కంటే టేస్టీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
 


ఇంట్లోనే సాంబార్ మసాలాను తయారుచేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలేంటి.. ఎలా తయారుచేసుకోవాలి అన్న విషయాలపై అవగాహణ ఉండాలి. ఇంతకీ సాంబార్ మసాలా పౌడర్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ఇంట్లోనే సాంబార్ మసాలాను ఎలా తయారుచేసుకోవాలి.. సాంబార్ మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులువు. దీనికోసం ముందుగా మీరు ఒక పాన్ తీసుకోవాలి. 
 

అందులో కొద్దిగా నూనె వేసి 1 టీస్పూన్ కొత్తిమీర, ఒకటీస్పూన్ మెంతి కూర, ఒక టీ స్పూన్ ఉలవపప్పు, ఒక టీ స్పూన్ శెనగపప్పును వేసి వేయించుకోవాలి. 
 

ఈ మసాలా దినుసులు మంచిగా వేగితే వాటినుంచి కమ్మని వాసన రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ నుంచి మసాలా దినుసులను మిక్సిలో వేసి మెత్తని పౌడర్ లా తయారయ్యేవరకు గ్రైండ్ చేసుకోవాలి. 
 

ఇంకేముంది రుచికరమైన తాజా సాంబార్ మసాలా రెడీ అయినట్టే. ఈ మసాలా దినుసులు సాంబార్ కు కమ్మని వాససనను తీసుకొస్తాయి. 

సాంబార్ అయిన తర్వాత ఈ మసాలా పౌండర్ వేయాలి. దీనిలో అది టేస్టీగా కావడమే కాదు కమ్మని వాసన కూడా వస్తుంది. ఈ మసాలాను గాలి వెల్లని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. 

Latest Videos

click me!