weight loss diet: వయసు పెరుగుతున్నా బరువు పెరగకూడదంటే ఈ డైట్ ను ఫాలో అవ్వాల్సిందే..

Published : May 08, 2022, 04:36 PM IST

weight loss diet: వృద్ధాప్యంతో పాటుగా కొత్త కొత్త రోగాలు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే సమయంలో వయసు పెరుగుతున్నప్పుడు బరువు కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే బరువు పెరిగే అవకాశమే ఉండదు.   

PREV
18
weight loss diet: వయసు పెరుగుతున్నా బరువు పెరగకూడదంటే ఈ డైట్ ను ఫాలో అవ్వాల్సిందే..

వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో రోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఒంట్లో పోషకాలు లోపిస్తే సర్వరోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ  ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. 
 

28

పెద్దవయసు వారు బరువు పెరిగితే తగ్గడం చాలా కష్టం. ఎందుకంటే వీరు వ్యాయామాలు చేయలేరు. మంచి డైట్ ను కూడా ఫాలో అవ్వలేరు. ఈ కారణంగానే శరీరంలో చెడు కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వయసు పెరిగినా.. బరువు పెరగకుండా చేయడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే.. 
 

38

అల్పాహారం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలతో చేసిన కిచిడీ లేదా ఓట్ మిల్క్ తీసుకుంటే కూడా మీ బరువు నియంత్రణలో ఉంటుంది. వీటితో పాటుగా వెజిటేబుల్స్ ను తీసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది. ఇవే కావు మీ రోజు వారి ఆహారంలో మల్టీ గ్రెయిన్ తో తయారు చేసిన చిల్లా లేదా పప్పును కూడా చేర్చుకోవచ్చు. 

48

లంచ్.. ఒకవేళ మీరు తేలికపాటి డైట్ ను ఫాలో అవ్వాలనుకుంటే అప్పుడప్పుడు రోటీ వెజిటేబుల్స్ ను , సలాడ్స్ విత్ డాల్ ను కూడా తీసుకోవచ్చు. ఈ వేసవిలో మీరు మధ్యాహ్నం పూట భోజనంలో శెనగపప్పు లేదా మజ్జిగను తీసుకోవచచు. అలాగే పండ్లను కూడా తినొచ్చు. అంతేకాదు వీటితో జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు. ఫ్రూట్ జ్యూస్ ను తాగిన కొంత సేపటి తర్వాత మీరు పప్పును తీసుకోవచ్చు. 

58

సాయంత్రం అల్పాహారంలో.. సాయంత్రం వేళ ఆకలిగా అనిపిస్తే చాలు చాలా  మంది టీని తాగుతుంటారు. ఈ అలవాటు ఉన్న వారు టీలోని పాలు,షుగర్ మీరు బరువు పెరిగేందుకు సహాయపడతాయి. అందుకే వీటికి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 

68

డిన్నర్.. డిన్నర్ లో మీరు  తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తినండి. ముఖ్యంగా రాత్రిపూట కూరగాయలు, రోటీ, పప్పు ను తినండి. అలాగే చీజ్ సలాడ్ లేదా సోయాబీన్ మిక్స్ సలాడ్ ను కూడా తీసుకోవచ్చు. ఇవేకాకుండా ఓట్ మీల్ లేదా కిచిడీ తీసుకున్నా మీ బరువు అదుపులో ఉంటుంది. 

78

శరీరం ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేట్టు చూసుకోండి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే.. ఒంట్లో శక్తి తగ్గుతుంది. అంతేకాదు నీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

88

అన్నాన్ని చాలా నెమ్మదిగా తినండి. ఇలా తింటే మీ కడుపు మోతాదు అన్నానికే నిండిన భావన కలుగుతుంది. అదనంగా తినలేరు. అదే వేగంగా తింటే చాలా ఎక్కువ మొత్తంలో తినే అవకాశం ఉంది.      

click me!

Recommended Stories