పరిగడుపున ఈ హెల్తీ ఫుడ్స్ తింటే మీ ఆరోగ్యం సేఫ్ ..!

Published : May 08, 2022, 05:01 PM IST

ప్రతిరోజూ పరిగడుపున కొన్నిరకాల హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల  మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు.ఇంతకి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
16
పరిగడుపున ఈ హెల్తీ ఫుడ్స్ తింటే మీ ఆరోగ్యం సేఫ్ ..!

కొన్ని రకాల ఆహార పదార్థాలు మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. మరీ ముఖ్యంగా పరిగడుపున వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడతాయి. అధిక బరువును కూడా తగ్గిస్తాయి. ఇంతకీ అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

26

బాదం.. బాదం పప్పులో ఐరన్, రాగి, జింక్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ పరిగడుపున తింటే ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. పోషకాహార లోపం కూడా ఏర్పడదు. 
 

36

చియా విత్తనాలు.. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పరిగడుపు తింటే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు. అయితే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి. అప్పుడే వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీ వెయిట్ కూడా అదుపులో ఉంచుతుంది. 

46

బొప్పాయి..  బొప్పాయిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు ఓవర్ గా తినలేరు. కానీ ఈ పండును తిన్న 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 
 

56

పుచ్చకాయ.. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. వేసవిలో తినాల్సిన పండ్లలో పుచ్చకాయ ముందుంటుంది. ఈ సీజన్ లో పుచ్చకాయను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. 

66

గోరువెచ్చని నీళ్లు, తేనె.. ప్రతిరోజూ లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చనే నీళ్లలో కాస్త నిమ్మరసం, తేనె వేసుకుని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఓవర్ వెయిట్ కూడా తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ జీర్ణక్రియనున కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories