మీ ఫోన్‌లో నెట్‌వర్క్‌ లేకపోయినా కాల్స్‌ చేయొచ్చు.. ఎలాగో తెలుసా

First Published | Aug 15, 2024, 1:30 PM IST

ప్రతి మనిషికి ఇప్పుడు సెల్‌ఫోన్‌ అత్యవసర వస్తువు కదా.. ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్లినా ఫోన్‌ ద్వారా మన సమాచారాన్ని అవతలి వారికి చెప్పేయొచ్చు. మరి మీరు ఉన్న చోట నెట్‌ వర్క్‌ లేకపోతే కాల్స్‌, మెసేజ్‌ చేయడం ఎలా..  మీ ఫోన్‌కు నెట్‌ వర్క్‌ లేకపోయినా ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ ఈజీగా చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..
 

 ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్లు ఎలా ఉంటున్నాయో, ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ బిజీ లైఫ్‌లో మనిషి సగం జీవితం ఆఫీసుల్లోనే గడిచిపోతోంది.  అందుకే యువత ఎక్కడికి వెళ్లినా ల్యాప్‌టాప్‌లు కూడా పట్టికెళుతున్నారు.  అదేవిధంగా వర్షం పడుతున్నప్పుడు, నెట్‌వర్క్‌ రిపేర్లు చేసేటప్పుడు సిగ్నల్స్‌ ఉండవు.  అలాంటి సందర్భాల్లో వెంటనే మీ ల్యాప్‌ టాప్‌ ఓపెన్‌ చేసి కాల్స్‌ చేయొచ్చు. అదెలా అంటే..
 

ల్యాప్‌టాప్ నుండి కాల్స్ చేయడం ఎలా?

నెట్‌వర్క్‌ సమస్య ఉన్నప్పుడు ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో కాలింగ్ సెట్టింగ్‌ను ముందుగా సెట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే ఫోన్‌ కాల్‌ ఐకాన్‌ దగ్గర క్లిక్‌ చేస్తే కాంటాక్ట్‌ నేమ్‌ కాని నంబర్‌ కాని అడుగుతుంది. ఎవరికి కాల్‌ చేయాలనుకుంటున్నాయో వారి నంబర్‌కు వెంటనే కాల్‌ వెళిపోతుంది.  వారు వేరే దేశంలో ఉన్నప్పటికీ WhatsApp డెస్క్‌టాప్‌ని ఉపయోగించి కాల్‌ చేసేయొచ్చు. అయితే దీని కోసం మీ ల్యాప్‌టాప్‌కు తప్పకుండా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని మర్చిపోకండి.
 


సెట్టింగ్‌ ఇలా చేసుకోండి..

1. WhatsApp కాల్ కోసం ముందుగా WhatsApp డెస్క్‌టాప్‌ యాప్‌ను ల్యాప్‌టాప్‌లో ఓపెన్‌ చేయండి.
2. తర్వాత వీడియో కాలింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
 

3. వాయిస్,  వీడియో కాల్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఆడియో అవుట్‌పుట్ పరికరం, మైక్రోఫోన్ ఎంపికను అంగీకరించండి. వెంటనే కాల్‌ వెళిపోతోంది.
4. మీ కాంటాక్ట్‌తో వాయిస్ కాల్‌ మాట్లాడుతున్నప్పుడు మీరు వీడియో కాల్‌కి మారొచ్చు. వీడియో కాల్‌ ఐకాన్‌ మీద క్లిక్ చేయండి. అవతలి వ్యక్తి స్విచ్‌ని అంగీకరిస్తే, మీరు వాయిస్ మరియు వీడియోకి మారవచ్చు.

Latest Videos

click me!