Crispy Samosa: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్ క్రిస్పీ సమోసా

Published : Mar 21, 2026, 12:31 PM IST

Crispy Samosa: సమోసా అనగానే ఆ కరకరలాడే పొర, లోపల వేడివేడి ఆలు మసాలా గుర్తొస్తాయి. కానీ ఇంట్లో చేసినప్పుడు అవి మెత్తగా అయిపోతుంటాయి. హోటల్ స్టైల్‌లో సమోసా కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. 

PREV
14
క్రిస్పీ సమోసా కోసం ఈ టిప్స్

సమోసా రుచిగా ఉండటం ఎంత ముఖ్యమో, అది కరకరలాడటం కూడా అంతే ముఖ్యం. చాలామంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమోసా వేయించిన కాసేపటికే మెత్తబడిపోతుంది. పర్ఫెక్ట్ క్రిస్పీ సమోసా కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి.  

24
పిండి కలిపే విధానం ముఖ్యం

మైదా పిండిలో కేవలం నీళ్లు కాకుండా, వేడి చేసిన నెయ్యి లేదా నూనె వేసి కలపాలి. పిండిని ఉండకడితే ముద్దలా అవ్వాలి. దీనివల్ల సమోసా పొరలు గుల్లగా, క్రిస్పీగా వస్తాయి.

34
పిండి గట్టిగా ఉండాలి

సమోసా పిండి పూరీ పిండి కంటే గట్టిగా ఉండాలి. నీళ్లు తక్కువగా పోస్తూ కలపాలి. పిండి మెత్తగా ఉంటే సమోసా పైన బుడగలు వస్తాయి, త్వరగా మెత్తబడిపోతుంది.

పిండి కలిపాక కనీసం 20 నుంచి 30 నిమిషాలు తడి క్లాత్ కప్పి పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి సాగే గుణాన్ని పొంది, సమోసా షేప్ పర్ఫెక్ట్‌గా వస్తుంది.

44
వేయించే పద్ధతి ముఖ్యం

చాలామంది నూనె బాగా మరిగాక సమోసాలు వేస్తారు. ఇది తప్పు. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే సమోసాలు వేయాలి. మంటను సిమ్‍లో ఉంచి నిదానంగా వేయించాలి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉండి, బయటకు తీయగానే మెత్తబడిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories