మీ వంట గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చే టాప్-10 చిట్కాలు మీకోసం

First Published | Sep 21, 2024, 11:27 PM IST

How to make LPG gas last longer : LPG గ్యాస్ అనేది మనం నిత్యం ఆహారాన్ని వండడానికి ఉపయోగించేది, కానీ దానిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవ‌డంతో ఎక్కువ రోజులు వ‌చ్చేలా చేసుకోవ‌చ్చు. పెరుతున్న ధ‌ర‌ల మ‌ధ్య మ‌నీని సేవ్ చేసుకోవ‌చ్చు. అలాంటి టాప్-10 చిట్కాలు మీకోసం.
 

Simple tips to make LPG cylinder in the kitchen last long

Simple hacks to make LPG cylinder last longer: ధరల పెరుగుదల ప్రతి ఇంటి బడ్జెట్‌లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అయితే, మీ వంటింట్లో నిత్యం గ్యాస్ పొయ్యి వెల‌గ‌నిదే మీకు ఆహారం రెడీ కాదు. అంటే ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ మీ వంటింట్లో అత్యంత కీల‌కమైంది. అయితే, ప్ర‌స్తుతం ధ‌ర‌ల పెరుగుద కార‌ణంగా వంటింటి ఖ‌ర్చులు మ‌రింత పెరుగుతున్నాయి. అయితే, పెరుతున్న ధ‌ర‌ల మ‌ధ్య ఎల్పీజీ  స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటే మ‌నీని సేవ్ చేసుకోవ‌చ్చు. అలాంటి టాప్-10 చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Best Ways to Save LPG Gas While Cooking

కొంతమంది వంట చేసేవారు బర్నర్‌ను మొత్తం పైకి తిప్పే చెడు అలవాటును ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వ‌ర‌గా అయిపోయే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మీరు ఏదైనా వేడి చేయాల‌నుకున్నా, వంట చేయాల‌నుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బ‌ర్న‌ర్ ను తిప్పుకుంటే స‌రిపోతుంది. దీని వ‌ల్ల ఎల్పీజీ సిలిండ‌ర్ ఎక్కువ రోజులు రావడంతో పాటు మీ వంట‌గ‌దిలో మ‌రింత వేడి లేకుండా ఉంటుంది.

మీ స్టవ్ బర్నర్‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా మీ ఎల్పీజీ సిలిండ‌ర్ ఎక్కువ రోజుల వ‌చ్చేలా చేస్తుంది. దీని కోసం మీరు మీ ఎల్పీజీ స్ట‌వ్ మంట రంగును గ‌మ‌నించాలి. నీలం రంగు మంట వ‌స్తే మీ బ‌ర్న‌ర్ స‌రిగ్గా ఉంద‌ని అర్థం. అలా కాకుండా ఎరుపు/పసుపు/నారింజ రంగు మంట వ‌స్తే మీ బ‌ర్న‌ర్ శుభ్రంగా లేద‌ని అర్థం. 

అంటే గ్యాస్ పూర్తిగా ఉప‌యోగించ‌డం జ‌ర‌గ‌నందున మంట అలా నీలం రంగు కాకుండా వ‌స్తుంది. గోరువెచ్చని నీరు, స్క్రబ్ బ్రష్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేయాలి. మీరు దీనిని చేయ‌లేక‌పోతే రిపేర్ చేసే వాళ్ల‌తో చేయించ‌డం మంచింది. 

Latest Videos


How to Save Gas while cooking at Home

మీరు వంట ప్రారంభించే ముందు అందుకు అవ‌స‌ర‌మైన ప‌ద‌ర్థాల‌ను ముందుగానే సిద్ధం చేసుకోవ‌డం కూడా మీ వంట గ్యాస్ ఎక్కువ రోజుల వ‌చ్చేలా చేస్తుంది. దాని కోసం మీరు వంట చేయాల‌నుకున్న, లేదా వేడి చేయాల‌నుకున్న‌ పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలి. మీకు అందుబాటులో ఉండేలా చూసుకోండి. దీని వ‌ల్ల మీరు వంట‌ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అనవసరంగా గ్యాస్ బర్న్ చేయరు.

తెరిచి ఉంచిన పాత్రల నుండి వేడి వేగంగా బయటకు వస్తుంది. దీని వ‌ల్ల వంట స‌మ‌యం పెరుగుతుంది. కాబ‌ట్టి  ఉడకబెట్టినప్పుడు వంటలను కవర్ చేయడం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. 

Here Are Hacks To Make Your LPG Sustain For Months

చాలా మంది వంట చేసేటప్పుడు నీరు లేదా పదార్థాల పరిమాణాన్ని కొలవరు. నీరు ఎక్కువ‌గా ఉంటే అది ఆవిరి అయ్యే వ‌ర‌కు వంట‌గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో మీ వంట గ్యాస్ ఎక్కువ రోజుల వ‌చ్చేలా చూసుకోవ‌చ్చు. 

అలాగే, వంట‌ పాత్రలను బర్నర్‌పై ఉంచే ముందు వాటిని పొడిగా ఉంచ‌డం కూడా మీ వంట గ్యాస్ ఎక్కువ రోజులు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. చిన్ననీటి బిందువులను కలిగి ఉన్న పాత్రలు నీటిని ఆవిరి చేయడానికి ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వ‌స్తుంది. 

పాన్ వేడెక్కిన తర్వాత, మీరు మంటను తగ్గించి గ్యాస్ ను ఆదా చేయవచ్చు. అధిక వేడి మీద వంట చేయడం వల్ల అందులో ఉన్న అవసరమైన ఎంజైమ్‌లు, పోషకాలు, విటమిన్లు నశించే అవ‌కాశం ఉండ‌దు. 

tips to make your LPG cylinder last longer

ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించండం వ‌ల్ల కూడా గ్యాస్ ను ఆదా చేయ‌వ‌చ్చు. ఓపెన్-పాస్‌ల వంటతో పోలిస్తే ఒత్తిడితో కూడిన ఆవిరి ఆహారాన్ని వేగంగా వండుతుంది. అలాగే, ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. కాబ‌ట్టి ప్రెషర్ కుక్క‌ర్ ను ఉప‌యోగించ‌డంతో మీ గ్యాస్ వినియోగం కొద్దిగా త‌గ్గుతుంది.

వన్-పాట్ మీల్స్ చేయండం వ‌ల్ల కూడా గ్యాస్ ఆదా అవుతుంది. వన్ పాట్ మీల్స్ అనేది ఒక పాత్రను, సాధారణంగా కుక్కర్‌ని ఉపయోగించి తయారు చేసే వంటకాల ప్ర‌క్రియ‌. ఇది వంట చేయడానికి సులభమైన మార్గం మాత్రమే కాదు, గ్యాస్ ను ఆదా చేసే పద్ధతి కూడా.

చాలా రోజుల నుంచి వాడుతున్న గ్యాస్ స్ట‌వ్ ల‌లో సాధార‌ణంగా గ్యాస్ లీక్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి మీ రెగ్యులేటర్, పైపు, బర్నర్ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాలి. మీ స్టవ్‌లో గ్యాస్ లైన్ దెబ్బ‌తిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. అలాగే, ఇది మీ భ‌ద్ర‌త‌ను కూడా ప్ర‌మాదంలో ప‌డేస్తుంది. కాబ‌ట్టి దీనిని వెంట‌నే ప‌రిష్క‌రించ‌డం ముఖ్యం. 

click me!