మిగిలిపోయిన సబ్బు ముక్కలతో హ్యాండ్ వాష్ ను ఎలా తయారుచేయాలి?

First Published Jun 14, 2024, 4:25 PM IST

చాలా మంది అరిగిపోయి, మిగిలిపోయిన సబ్బుముక్కలతో ఏం చేయాలో తెలియక డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ మిగిలిపోయిన సబ్బు ముక్కలతో చాలా సులభంగా హ్యాండ్ వాష్ ను తయారుచేయొచ్చు. అదెలాగంటే? 

చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం వల్ల ఎలాంటి రోగాన్నైనా తగ్గించుకోవచ్చని మనం కొన్నేళ్ల కిందట వచ్చిన కరోనా మహమ్మారి మనకు నేర్పింది. ఎప్పటికప్పుడు చేతులను కడుక్కోవడం ఇందులో ఒకటి. తినడానికి ముందు, తిన్న తర్వాత, కొన్నిసార్లు అవసరమైనప్పుడల్లా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పెద్దలు తరచుగా చెప్తూనే ఉంటారు. అయితే ఇందుకోసం చాలా మంది బయటి నుంచి ఖరీదైన హ్యాండ్ వాష్ లను కొంటుంటారు. కానీ ఇంట్లోనే రూపాయి ఖర్చులేకుండా మీరు  హ్యాండ్ వాష్ ను తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది స్నానం చేసే సబ్బులు అరిగిపోయిన తర్వాత పారేస్తుంటారు. వీటివల్ల ఏం  ఉపయోగం లేదనుకుంటారు. మిగిలిన సబ్బు ముక్కలను విసిరేయడానికి బదులుగా వాడుచ్చు. అందుకే ఈ మిగిలిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలతో మీరు హ్యాండ్ వాష్ ను తయారుచేయొచ్చు. దీనికి మీరు రూపాయి ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలం మిగిలిన సబ్బు ముక్కలు, నీళ్లు మాత్రమే దీనికి అవసరం. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ముందుగా మిగిలిన సబ్బు ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పిండిలా తయారుచేయండి. మీ ఇంట్లో మిక్సర్ లేకపోతే కంగారు పడకండి. సబ్బును తురమండి. ఇప్పుడు దీన్ని కొన్ని శుభ్రమైన నీళ్లలో వేసి మరిగించండి. దీన్ని గోరువెచ్చగా ఉంచండి. 100 గ్రాముల సబ్బు ఉంటే రెండు గ్లాసుల నీరు అవసరపడుతుంది. ఈ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని మీ హ్యాండ్ వాష్ ను సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఈ నీటిని నెమ్మదిగా కలపండి. ఇది మార్కెట్ హ్యాండ్ వాష్ లాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండండి. 

మరికాసేపట్లో మీ హ్యాండ్ వాష్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో రెండు టీస్పూన్ల ఆముదం లేదా గ్లిజరిన్ కూడా కలుపుకోవచ్చు. ఇది మీ చేతులను మృదువుగా ఉంచుతుంది. అయితే మీరు తయారుచేసిన హ్యాండ్ వాష్ మంచి సువాసన రావాలంటే మాత్రం కొద్దిగా డెటాల్ ను కలపండి. 

Latest Videos

click me!