ఎక్సర్ సైజ్ చేయకుండా బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

First Published | Jun 8, 2024, 11:04 AM IST

బరువు తగ్గడానికి జనాలు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి వ్యాయామం చేసే టైం ఉండదు. కొంతమంది అయితే వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలనుకుంటారు. ఇలాంటి వారికి కొన్ని చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటంటే? 
 

weight loss

వ్యాయామాలు మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాయామాలు మనం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ కొంతమంది వ్యాయామం చేయకుండా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వ్యాయామం లేకుండా కూడా బరువు తగ్గొచ్చు. అయితే ఇందుకోసం మీరు ఆహారం, జీవనశైలికి సంబంధించిన కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మీరు బరువు తగ్గడం సులభం అవుతుంది. వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

weight loss

ఆహారాలు

బరువు తగ్గడానికి మీరు ముందుగా చేయాల్సిన పని ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలకు దూరంగా ఉండటం. బరువు తగ్గాలంటే వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినకూడదు. వీటికి బదులుగా మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను చేర్చాలి. వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే ఇది ఆకలిని తగ్గిస్తుంది.
 


ఒత్తిడికి గురికావొద్దు

ఒత్తిడి కూడా బరువును పెంచుతుంది. ఒత్తిడి మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే ఒత్తిడికి లోనైప్పుడు ఏ పనిచేస్తున్నామో కూడా తెలియదు. దీనివల్ల ఎంతతింటున్నారో తెలియకుండా తింటూనే ఉంటారు. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అందుకే ఒత్తిడికి, యాంగ్జైటీకి దూరంగా ఉండాలి. 
 

హెల్తీ స్నాక్స్ 

మీరు బరువు పెరగడం వెనుక మీరేం స్నాక్స్ తింటున్నారో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బిస్కెట్లు, చిప్స్ లేదా ఇతర ప్రాసెస్ చేసిన స్నాక్స్ ను తింటే మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశముంది. అందుకే వీటిని తినకండి. వీటికి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను, నట్స్  ను తినండి. 

చక్కెర తక్కువగా 

చాలా మందికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టముంటుంది. రోజూ ఏదో ఒక రూపంలో స్వీట్లను తింటూనే ఉంటారు. కానీ చక్కెర పదార్థాలు మీ బరువును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీకు కూడా ఈ అలవాటు ఉంటే.. వెంటనే మానుకోండి. అప్పుడే మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. 

Latest Videos

click me!