ఎముకల్లో బలాన్ని పెంచే ఫుడ్స్ ఇవి..!

First Published | Sep 6, 2021, 2:47 PM IST

ఎముకలో కాల్షియం ఉన్నప్పుడే.. మనం ధృఢంగా ఉంటాం. అలా లేని సమయంలో.. చిన్న దానికే చేతులు కాళ్లు నొప్పి పెట్టడం.. లేదంటే త్వరగా విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎముక పుష్టి కలిగి ఉండాలి. ఎముక బలంగా ఉన్నవారు.. ధృఢంగా కనపడతారు.  ఎముకలో కాల్షియం ఉన్నప్పుడే.. మనం ధృఢంగా ఉంటాం. అలా లేని సమయంలో.. చిన్న దానికే చేతులు కాళ్లు నొప్పి పెట్టడం.. లేదంటే త్వరగా విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. బలహీనంగా కూడా కనపడుతూ ఉంటారు. అయితే.. ఈ  ఎముక బలాన్ని పెంచాలంటే.. కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి. అవేంటో ఓసారి చూసేద్దామా..

ఎముకల్లో యాభై శాతం ప్రొటీన్​ ఉంటుంది. అందువల్ల ఎముకల ఆరోగ్యానికి ప్రొటీన్​ తప్పనిసరి. ప్రొటీన్​ తగ్గితే క్యాల్షియం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ప్రొటీన్​ తగ్గడం వల్ల శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. పెద్దవాళ్లు సగటున రోజుకు వంద గ్రాములకుపైగా ప్రొటీన్​ తీసుకోవాలి. ప్రొటీన్​ తగినంత తీసుకుంటే స్త్రీలలో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


పాలకూర..

అన్ని ఆకుకూరల్లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే.. పాలకూరలో అదనంగా కాల్షియం కూడా ఉంటుంది. ఒక కప్పు ఉడకపెట్టిన పాలకూరలో మన శరీరానికి అవసరమైన కాల్షియంలో  25శాతం దీని నుంచే లభిస్తుంది. అంతేకాదు.. దీనిలో ఫైబర్, విటమిన్ ఏ, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముక పుష్టికి ఎంతగానో సహాయం చేస్తాయి.

ఆరెంజ్..
తాజా ఆరెంజ్ జ్యూస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ డి వంటివి ఈ ఆరెంజ్ జ్యూస్ లో లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ సహాయం చేస్తుంది. ఎముక బలానికి సహాయం చేస్తుంది.
 

అరటిపండు,,

అరటిపండు జీర్ణ క్రియలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం మనకు తెలసిందే. అయతే.. ఈ అరటిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ అరటిపండు కచ్చితంగా తీసుకోవాలి.
 

పైనాపిల్.. 
పైనాపిల్ లో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. దీనిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కాల్షియాన్ని కోల్పోయినప్పుడు.. దీనిని తీసుకోవడం వల్ల.. త్వరగా.. మళ్లీ ధృఢంగా మారే అవకాశం ఉంటుంది. పైనాపిల్ వంటకాలను కూడా తినొచ్చు.

స్ట్రాబెర్రీలు..
ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. రోజూ రెండు స్ట్రాబెర్రీలను తినడం మంచిది. వీటితో చేసిన వంటకాలను కూడా తినొచ్చు.

papaya


బొప్పాయి..

ఈ బొప్పాయి పండులోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల బొప్పాయిలో.. 20 గ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి.. మీరు తీసుకునే డైట్ లో బొప్పాయి పండును కచ్చితంగా చేర్చాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం ధృఢంగా మారుతుంది.

అనేక పోషకాలు కలిగిన కూరగాయలు ఎముకలకు మేలు చేస్తాయి. అయితే విటమిన్​–సి ఉండే కూరగాయలు మరింత అవసరం. ఎముకల్లో కొత్త కణాలు వృద్ధి చెందేందుకు విటమిన్​–సి ఉపయోగపడుతుంది. కణజాలం దెబ్బతినకుండా చూస్తుంది. క్యాల్షియం సహా ఇతర ఖనిజాలు సరైన మోతాదులో ఉంటేనే ఎముకల స్థిరత్వం పెరుగుతుంది. ఈ విషయంలో కూరగాయలు ఎంతగానో తోడ్పడతాయి. ఉల్లిపాయలు, బ్రకోలి, క్యాబేజి వంటి కూరగాయలు ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
 

Latest Videos

click me!