
మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. అవి దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలి. డయాబెటీస్, వృద్ధాప్యం, కుటుంబ చరిత్ర, అధిక రక్తపోటు వంటి సమస్యల వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మూత్రపిండాల వ్యాధి గుండె, రక్తనాళాల వ్యాధి ప్రమాదాలను పెంచుతుంది. పాలీసిస్టిక్ మూత్రపిండాల వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూత్రపిండాల్లో పెద్ద తిత్తులు (large cysts) ఏర్పడటానికి దారితీస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. మరోటి లూపస్. ఇది మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. లూపస్ నెఫ్రిటిస్ ను స్వయం ప్రతిరక్షక వ్యాధి అని పిలుస్తారు. ఇది మూత్రపిండాల్లో వ్యర్థాలను ఫిల్టర్ చేసే చిన్న రక్తనాళాల వాపునకు దారితీస్తుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నవారికి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఇది ఒక్కొక్కరికి చివరికి డయాలసిస్ లేదా అవయవ మార్పిడి అవసరం కావొచ్చు.
మన దేశంలో లక్షల మంది రకరకాల మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయినా దీని గురించి చాలా మందికి తెలియదు. అందుకే మూత్రపిండాల వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ముదిరే వరకు ఎలాంటి తేడా ఉండదు. చాలా మంది అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసినా.. మూత్రపిండాల వ్యాధిని మాత్రం గుర్తించలేకపోతుంటారు. మూత్రపిండాల వ్యాధిని గుర్తించాలంటే వ్యాధి నిర్దారణ టెస్ట్ లు చేయించుకోవాలి. మూత్రపిండాల వ్యాధి బారిన పడితే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని బట్టి కూడా నిర్దారించొచ్చు. అవేంటంటే..
అలసట: మీరు ఏ పనిచేయపోయిన అలసిపోతున్నట్టైతే.. మీ మూత్రపిండాలు ఖచ్చితంగా దెబ్బతిన్నాయని అర్థం చేసుకోండి. నిర్ధారించుకోవడానికి హాస్పటల్ కు వెళ్లండి. ఇది ఆందోళనలను పెంచుతుంది. అంతేకాదు కొన్ని అంతర్లీన సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఆకలి లేకపోవడం: మూత్రపిండాలు దెబ్బతింటే కూడా సరిగ్గా కాదు. ఇది మీ సమస్య ముదిరిందని సూచిస్తుంది. సాధారణంగా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి.
పాదాల వాపు, చీలమండలు: మూత్రపిండాల వ్యాధి ఉన్న వారిలో సాధారణంగా పాదాలు, చీలమండలు వాపునకు గురవుతాయి.
ఉబ్బిన కళ్లు: కంటి చుట్టూ ఉబ్బితే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి సాధారణ లక్షణం.
పొడి చర్మం, దురద: మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేకుంటే.. మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. దురద కూడా పెరుగుతుంది. అలాగే మన ఒంటి నుంచి దుర్వాసన వస్తుంది.
మూత్రవిసర్జనలో మార్పులు: మూత్రవిసర్జపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. అంటే రోజులా కాకుండా సడెన్ గా మూత్రవిసర్జన తగ్గిపోవచ్చు. లేదా తరచుగా మూత్రవిసర్జన చేయడం. ముఖ్యంగా రాత్రిపూట. ఇవి మూత్రపిండాల వ్యాధికి సంకేతాలు.
అధిక రక్తపోటు: అధిక రక్తపోటు కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైపర్ టెన్షన్ తో బాధపడే వారు చాలా మటుకు మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.