Pigeons: మీ ఇంటి బాల్కనీలోకి పావురాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయా? ఒక్కసారి ఈ పావురాలు రావడం అలవాటుపడితే.. మొత్తం పాడు చేస్తాయి. అయితే, ఈ చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ ఇంటివైపు పావురాలు తొంగి కూడా చూడవు.
పావురాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కానీ, ఈ పక్షులతో ఉన్న సమస్య ఏమిటంటే.. అవి బాల్కనీతో సహా ఇంట్లోకి వచ్చేస్తాయి. కిటికీ పక్కన, ఏసీ యూనిట్లతో సహా గూళ్లు కట్టేసుకుంటాయి. ఈ సమస్య ముఖ్యంగా ఫ్లాట్లలో నివసించే వారిలో సర్వసాధారణం. చూడటానికి ప్రశాంతంగా కనిపించే ఈ పక్షులు కొన్నిసార్లు చికాకు కలిగిస్తాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అవి ఇంటి బాల్కనీ మూలల్లో గూళ్లు కట్టేసి, ఇంటి గోడలు, నేలను పాడు చేస్తాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ, ఏం చేసినా ఈ పావురాలు వెళ్లిపోవడం లేదని ఫీలౌతున్నారా? కేవలం కొన్ని చిట్కాలు ఫాలో అయితే వాటిని తరిమికొట్టచ్చు.
24
1.కాక్టస్ మొక్కలు...
కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు పావురాలను మీ బాల్కనీలోకి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఈ మొక్కల ముళ్లు పావురాలను భయపెడతాయి. అవి ఈ మొక్కల దగ్గర కూర్చోకుండా ఉంటాయి. అందుకే, బాల్కనీలో ఈ మొక్కలను పెంచితే సరిపోతుంది.
34
పక్షి స్పైక్‌లను ఇన్‌స్టాల్ చేయడం
AC క్యాబినెట్ లేదా బాల్కనీ రైలింగ్‌పై బర్డ్ స్పైక్‌లను ఇన్‌స్టాల్ చేయడం సులభమైన, ప్రభావవంతమైన మార్గం. ఈ స్పైక్‌లు పావురాలు వాటిపై కూర్చోకుండా నిరోధిస్తాయి. అసలు వాటిని చూస్తేనే పావురాలు అక్కడకు రావడానికి ఆలోచిస్తాయి.
అంతేకాదు.. పావురాలు మెరిసే వస్తువులకు కూడా భయపడతాయి. మీరు పాత సీడీలు, రేకు లేదా ఏదైనా మెరిసే వస్తువును బాల్కనీలో వేలాడదీయవచ్చు. వాటి మెరుపు పావురాలను భయపెడుతుంది.
వీలైతే, AC అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ బలమైన నెట్ అమర్చాలి. ఇది పావురాలను రాకుండా ఆపొచ్చు. అంతేకాదు.. పావురాలు గూడు కట్టడానికి కూడా వీలు ఉండదు. ఇక.. పావురాలకు బలమైన వాసన నచ్చదు. దాని కోసం మీరు వెనిగర్ వాడితే సరిపోతుంది. వెనిగర్ లో కొద్దిగా నీరు కలిపి మీ బాల్కనీ లో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ వాసనకు పావురాలు రాకుండా ఉంటాయి.
4.పావురాలకు ఆహారం ఇవ్వకండి...
చాలా మందికి పావురాలకు ఆహారం పెట్టే అలవాటు ఉంటుంది. అలా చేస్తే.... పావురాలు వస్తూనే ఉంటాయి. అందుకే.. ముందు ఆ పని చేయడం ఆపేయాలి.మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఇలా పావురాలకు ఆహారం పెడుతున్నా కూడా వారికి కూడా వీటి వల్ల వచ్చే సమస్యలను వివరించండి.