బుగ్గలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Jan 21, 2024, 10:52 AM IST

కొంతమంది బరువు బాగానే ఉన్నా.. బుగ్గలు మాత్రం బొద్దుగా అంటే అందంగా ఉండవు. వీటిని ఎలా పెంచాలో తెలియక ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో బుగ్గలను బొద్దుగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది అమ్మాయిలకు బుగ్గలు బొద్దుగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే బొద్దు బుగ్గలు ముఖ అందాన్ని పెంచుతాయి. బొద్దుగా ఉండే బుగ్గలు మీ ఫేస్ గ్లో ను పెంచుతాయి. మీకు బుగ్గలు లేకుంటే.. వాటిని ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ నూనెతో బుగ్గలు బొద్దుగా పెరిగేలా కూడా చేయొచ్చు. ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మీ బుగ్గలు బొద్దుగా మారేలా చేస్తుంది. ఇందుకోసం మీ బుగ్గలకు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయండి. 
 


బాదం నూనె

బాదం నూనె కూడా మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సన్నగా ఉండే బుగ్గలు బొద్దుగా, ఆకర్షణీయంగా చేయడానికి మీరు ప్రతి రోజూ బాదం నూనెను బుగ్గలకు పెట్టి ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ బుగ్గలు తొందరగా చబ్బీగా మారుతాయి. 

ఆవనూనె

ఆవనూనె కూడా బుగ్గలను బొద్దుగా మార్చడానికి సహాయపడుతుంది. ఈ ఆవనూనెను ప్రతి రోజూ బుగ్గలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. దీనివల్ల మీ బుగ్గలు సహజంగా గుడ్రంగా, చబ్బీగా మారుతాయి. 
 

avacado oil

అవొకాడో ఆయిల్

అవొకాడో నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆయిల్ ను చర్మానికి పెట్టడం వల్ల డ్రైనెస్ తొలగిపోతుంది. అలాగే ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నూనెను ఉపయోగించి బుగ్గలను కూడా పెంచొచ్చు. అవును ఈ నూనెతో బుగ్గలను మసాజ్ చేయడం వల్ల బుగ్గలు బొద్దుగా మారుతాయి. 
 

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె ఒక్క జుట్టుకే కాదు మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. ఇది చర్మం తేమను నిలుపుకునేలా చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఈ నూనె మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. అలాగే బుగ్గలను పెంచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ ఒక ఐదు నిమిషాల పాటు కొబ్బరి నూనెతో బుగ్గలను మసాజ్ చేయాలి. 

Latest Videos

click me!