టీ తాగకపోతే చాలా మందికి డే స్టార్ట్ కాదు. టీ ఇచ్చే కిక్కు అలాంటిది మరీ. రోజుకు ఎన్నిసార్లు టీ ఇచ్చినా నో చెప్పని వాళ్లు కూడా చాలామంది ఉంటారు. టీకి అంత రుచినిచ్చేది టీ పొడి. మరి అలాంటి టీ పొడి బాగుందా? లేక పాడైపోయిందా? అని ఎలా తెలుసుకోవాలంటే..
టీ చాలా మందికి ఇష్టమైన డ్రింక్. మంచి టీ.. శరీరానికి, మనసుకు ఉత్తేజాన్నిస్తుంది. ఇంక వర్క్ మధ్యలో టీ తాగడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. అల్లం టీ, యాలకుల టీ లాంటివి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తాయి. కానీ టీ పొడి పాడైపోతే, దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలు ఉండవట. ఇంతకీ టీపొడి పాడైపోయిందో లేదో ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
పాడైన టీ పొడి:
టీ నాణ్యతను దాని వాసన, రుచి, రంగు ద్వారా తెలుసుకోవచ్చు. టీ పొడి పాడైపోతే దాని రంగు, వాసన, రుచి మారిపోతాయి. టీ చేసేటప్పుడు బలమైన వాసన లేకపోతే, అది పాడైపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఆకులలోని ముఖ్యమైన నూనెలు ఆవిరైపోతే దాని రుచి పోతుంది. వాసన కూడా ఉండదు.
36
ఎలా గుర్తించాలి?
టీ పొడి పాడైపోయిందో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం రుచి పరీక్ష. కొద్దిగా నీటిలో టీ ఆకులను వేసి మరిగించాలి. దాన్ని వడగట్టి తాగేటప్పుడు మంచి టీ తాగిన అనుభూతి రావాలి. అలా వస్తే అది పాత టీ పొడి కానట్టే. రంగును బట్టి కూడా టీ పొడి నాణ్యతను తెలుసుకోవచ్చు.
46
గడువు దాటితే..
అన్ని వస్తువుల మాదిరిగానే టీ పొడికి కూడా గడువు ఉంటుంది. ఆ టైం లోపే దాన్ని వాడుకోవాలి. ఒకసారి గడువు దాటిపోతే రుచి పోతుంది. నాణ్యత తగ్గిపోతుంది. దాంతో తయారు చేసిన టీ బాగోదు.
56
పాడవకుండా ఎలా ఉంచాలి?
టీ ఆకులు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా నిల్వ చేయాలి. ఎక్కువ తేమ ఉన్న ప్రదేశంలో టీ పొడిని ఉంచకూడదు. ఎక్కువ తేమ టీ పొడిని గడ్డకట్టేలా చేస్తుంది. గాలి చొరబడని సీసాలలో నిల్వ చేస్తే మంచిది.
66
పాడైన టీ పొడిని ఎలా వాడాలి?
టీ పొడి పాడైపోతే దాన్ని ఇంకో రకంగా వాడవచ్చు. బట్టలకు రంగు వేయడానికి, మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. కొందరు వాసన, రుచి కోల్పోయిన టీని సూప్‌లు లేదా కూరల్లో వాడతారు. ఫేస్ ప్యాక్ గా కూడా వేసుకుంటారు. ముఖాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉంచే ఫేస్ స్ప్రే తయారు చేయడానికి టీ పొడిని ఉపయోగిస్తారు.