Washing Cloths:ఏ డ్రెస్ ని ఎలా ఎలా ఉతకాలో మీకు తెలుసా?

Published : Feb 03, 2025, 05:08 PM IST

మనం కొనే కొత్త దుస్తుల మీద ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ మీద కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. వాటి ప్రకారం దుస్తులు ఉతికితే మాత్రమే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందామా...

PREV
14
 Washing Cloths:ఏ డ్రెస్ ని ఎలా ఎలా ఉతకాలో మీకు తెలుసా?
washing clothes, washing machine

ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త దుస్తులు కొనుక్కునేవాళ్లు చాలా మంది ఉంటారు.  అయితే.. దుస్తులు కొనుక్కోగానే సరిపోదు.. వాటిని ఎలా వెతుక్కోవాలో  కూడా తెలుసుకోవాలి.  మనం తెలిసీ తెలియక ఎలా పడితే అలా దుస్తులను ఉతకడం వల్ల  కొన్ని రంగులు పోవడం, పాడైపోవడం లాంటివి జరుగుతాయి. అలా కాకూడదు అంటే దుస్తులను జాగ్రత్తగా ఉతకాల్సి ఉంటుంది. నిజానికి, మనం  కొనే దుస్తులపైనే వాటిని మనం ఎలా ఉతకాలి అనేది ఉంటుంది అని మీకు తెలుసా? మనం కొనే కొత్త దుస్తుల మీద ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ మీద కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. వాటి ప్రకారం దుస్తులు ఉతికితే మాత్రమే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందామా...
 

24

దుస్తులు ఉతకడానికి ముందు తెలుసుకోవాల్సిన 4 విషయాలు..

 కొత్త దుస్తులు ఉతకడానికి ముందు ఈ గుర్తులను జాగ్రత్తగా చూసి, వాటి ప్రకారం ఉతకాలి. 

1.బకెట్ గుర్తు..

ఏ దుస్తులు తీసుకున్నా, దానిపై 4 నుండి 5 గుర్తులు ఉంటాయి. మీ దుస్తుల ట్యాగ్‌లో బకెట్‌లో చేయి ఉన్నట్లు గుర్తు ఉంటే, ఆ దుస్తులను కేవలం  చేత్తోనే ఉతకాలి. ట్యాగ్‌లో కేవలం బకెట్ గుర్తు మాత్రమే ఉంటే, వాషింగ్ మెషిన్‌లో ఉతకవచ్చు.

34
washing clothes, washing machine


ట్యాగ్‌లో వృత్తం గుర్తు

కొత్త దుస్తుల ట్యాగ్‌లో వృత్తం గుర్తు ఉంటే, ఆ  డ్రెస్ ను డ్రై క్లీన్ చేయించుకోవాలి. వృత్తంపై క్రాస్ గుర్తు ఉంటే, డ్రై క్లీన్ అవసరం లేదు.

ఇస్త్రీ గుర్తుపై మూడు చుక్కలు

దుస్తుల ట్యాగ్‌పై ఇస్త్రీ గుర్తు, దానిపై మూడు చుక్కలు ఉంటే, తక్కువ వేడితో ఇస్త్రీ చేయాలి. ఇస్త్రీ గుర్తుపై ఒక చుక్క ఉంటే, ఎక్కువ వేడితో ఇస్త్రీ చేయవచ్చు.
 

44
washing clothes, washing machine

చతురస్రంలో వృత్తం

దుస్తుల ట్యాగ్‌లో చతురస్రం లోపల వృత్తం, దాని మధ్యలో చుక్క ఉంటే, మెషిన్‌లోనే ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఈ గుర్తుపై క్రాస్ గుర్తు ఉంటే, ఎండలో ఆరబెట్టవచ్చు.

ఈ 4 గుర్తులను చూసి, వాటి ప్రకారం ఉతికి, ఆరబెడితే, కొత్త దుస్తులు చాలా కాలం కొత్తగానే ఉంటాయి. 

click me!

Recommended Stories