మూత్రంలో మంట ఎందుకొస్తుంది?

First Published Apr 27, 2024, 11:41 AM IST

చాలా మందికి మూత్రంలో విపరీతమైన మంట వస్తుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు మూత్రంలో మంట ఎందుకొస్తుందో తెలుసా?
 

మూత్ర విసర్జన చేసే సమయంలో మంట వచ్చే సమస్యను డైసూరియా అంటారు. ఈ సమస్య ఎక్కువగా పేలవమైన జీవనశైలి, చెడు ఆహారాల వల్ల వస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు భరించలేని మంట కలుగుతుంది. మీకు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నట్టైతే దానిని అస్సలు లైట్ తీసుకోకండి. అసలు మూత్రంలో మంట ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) సమస్య వల్ల కూడా మూత్రంలో చికాకు కలుగుతుంది. అలాగే విపరీతమైన మంటకు కారణమవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య మహిళల్లో సర్వసాధారణమైన సమస్య. యూటీఐ అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది పెద్ద ప్రేగు నుంచి వచ్చే బ్యాక్టీరియా మూత్ర మార్గంలోకి ప్రవేశించినప్పుడు వస్తుంది. 

మూత్రపిండాల్లో రాళ్లు

చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఉంటే వాళ్లకు మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట అనుభూతి కలుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కొన్నిసార్లు మూత్రాశయంలో చిక్కుకుపోతాయి.  దీనివల్ల మూత్రంలో మండుతున్న అనుభూతి కలుగుతుంది. 
 

అండాశయాల్లో తిత్తులు

అండాశయంలో తిత్తులు ఉన్నప్పుడు కూడా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంట కలుగుతుంది. 

వేయించిన ఆహారం 

డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువగా వేయించిన ఆహారాలను తింటే మూత్రంలో చికాకు కలుగుతుంది. అలాగే మూత్రం కూడా మంట వస్తుంది. 
 

లైంగిక సంక్రమణ అంటువ్యాధులు 

లైంగిక సంక్రమణ అంటువ్యాధులు ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఈ లైంగిక సంక్రమణ అంటువ్యాధులు మూత్రంలో చికాకు, దురదకు కారణమవుతాయి. ఈ సమస్య ఉన్నవారు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. 
 

నీటి కొరత

మూత్రంలో మంట వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది భయంకరమైన రోగానికి సంకేతమేమీ కాదు. చాలా సార్లు మీ శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల మూత్రంలో మంట కలుగుతుంది. అలాగే మూత్రం కొద్దికొద్దిగా తరచుగా వస్తుంది. ఇలాంటప్పుడు మీరు కొబ్బరినీళ్లను తాగాలి. 
 

రసాయన వినియోగం

కొన్ని రసాయనాల వాడకం వల్ల కూడా డైసూరియాకు కారణమవుతుంది. సబ్బు, సువాసనగల టాయిలెట్ పేపర్, గర్భనిరోధకాలు, యోని కందెన, ప్రైవేట్ భాగాలకు ఉపయోగించే కొన్ని రసాయనాలు మూత్రంలో చికాకు కలిగిస్తాయి. మూత్రం మంటకు కారణమవుతాయి.

click me!