ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు..

Published : Apr 03, 2022, 10:38 AM IST

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తులసి, వెల్లుల్లి , పుదీనా వాసనలకు ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి చొరబడే సాహసం కూడా చేయదు. ఎందుకో తెలుసా.. 

PREV
19
ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు..

ఎండాకాలం అలా వచ్చిందో లేదో.. అప్పుడే దోమల బెడద కూడా మొదలయ్యింది. రాత్రైతే చాలు కంటికి నిద్రలేకుండా చేస్తుంటాయి. గుంపులుగా గుంపులుగా వస్తూ రక్తాన్ని పీల్చుతూ ఉంటాయి. దోమలు రక్తాన్ని తాగడం అంత మంచి విషయమైతే కాదు. దోమకాటు వల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. 

29

దోమకాటు వల్ల ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మరి ఇవి కుట్టకూడదంటే.. దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. మరి దోమలు ఇంట్లోకి రాకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.. 

39

దోమలు ఇంట్లోకి రాకూడదంటే.. ఇంట్లో ఉన్న కిటికీలు, డోర్లకు ముందు సన్నని జాలి (జల్లెడ)ను పెట్టాలి. దీనివల్ల దోమలు ఇంట్లోకి చొరబడవు. 

49
mosquitoes

అలాగే ఇంట్లో లేదా.. ఇంటి చుట్టుముట్టు పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇక ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రావు. కానీ వీటి వల్ల దోమలతో పాటుగా మనుషులకు కూడా ప్రమాదమే. కాబట్టి వీలైనంత వరకు దోమలను ఇంటి చిట్కాలతోనే తరిమికొట్టాలి. 

59

వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీని వాసన మాత్రం అంతగా బాగోదు. ఈ వాసన మనకే కాదు దోమలకు కూడా నచ్చదట. వెల్లుల్లి వాసనకు దోమలు పారిపోతాయట. ఇందుకోసం వెల్లుల్లిని మెత్తగా గ్రైండ్ చేసుకుని దోమలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటున్నాయో అక్కడ పెట్టండి. దెబ్బకి దోమలు అక్కడ లేకుండా వెళ్లిపోతాయి. 
 

69

నిమ్మకాయ.. నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి.. అందులో రెండు మూడు లవంగాలను పెట్టాలి. దీనివల్ల కూడా దోమల బెడద వదిలిపోతుంది. 

79

పుదీనా.. పుదీనా స్మెల్ మనకు ఎంతో నచ్చుతుంది కానీ.. వీటి స్మెల్ దోమలకు మాత్రం వెగటు పుట్టిస్తుంది. ఇందుకోసం పుదీనా నూనెను తీసి ఇంట్లో అక్కడక్కడ చల్లండి. 
 

89

తులసి.. తులసి మనకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనివాసన కూడా ఎంతో బావుంటుంది. కానీ తులసి ఆకుల వాసన దోమలకు మాత్రం నచ్చదు. ఇంట్లో ఉండే దోమలు పారిపోవాలంటే.. తులసి ఆకుల నుంచి నూనెను తీసి ఇంట్లో అక్కడక్కడ చల్లండి. దీంతో దోమలు పరార్ అవుతాయి. 

99

నిమ్మగడ్డి.. నిమ్మగడ్డి గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ దీనితో కూడా దోమలు ఇట్టే పారిపోతాయి. ఈ నిమ్మగడ్డి ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది.    

click me!

Recommended Stories