Health Tips: తిన్న వెంటనే కడుపు ఉబ్బుతోందా? అయితే వీటిని తినకండి.

Published : Apr 01, 2022, 05:02 PM IST

Health Tips: తిన్న వెంటనే కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారు ఆపిల్ , బ్రోకలి, వెల్లుల్లి, బీన్స్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.   

PREV
17
Health Tips: తిన్న వెంటనే కడుపు ఉబ్బుతోందా? అయితే వీటిని తినకండి.

మారిన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల మూలంగా నేడు ఎంతో కడుపు ఉబ్బరం సమస్యతో సతమతమవుతున్నారు. వీరికి తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతుంటుంది. దీంతో వారు కదురుగా ఉండలేదు. ఈ సమస్య రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 
 

27

వాస్తవానికి కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడటం వల్ల కడుపు ఉబ్బరం సమస్య  తలెత్తుతుంది. దీనికి తోడు ఒకే చోట గంటలకు గంటలు కూర్చోవడం, సమయపాలన లేకుండా తినడం వంటి కారణాల వల్ల వస్తుంటుంది. 

37

మలబద్దకం సమస్య ఉన్న వారికి కూడా ఉదర సమస్య వేధిస్తుంటుంది. ఈ సమస్య ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాటితో ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవేంటంటే.. 

47

ఆపిల్.. ఉదర సమస్యతో బాధపడేవారు ముందుగా యాపిల్ పండ్లను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. అందులో ఉండే ఫైబర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ను మరింత పెంచుతుంది. దీంతో కడుపులో నొప్పితో పాటుగా కడుపు ఉబ్బరం సమస్య కూడా తలెత్తుతుంది. 
 

57

బ్రోకలి.. కడుపు ఉబ్బరం సమస్యతో సతమతమయ్యే వారు బ్రోకలీకి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది అంత తొందరగా అరగదు. దీంతో మీ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. 

67

బీన్స్.. బీన్స్ ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువ అవుతుంది.  బీన్స్ లో ఉండే ఫైబర్ కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉదర సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు దీనికి వీలైనంత దూరంగా ఉండండి.  

77

వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే కానీ వీటిలో ఉండే ఫ్రక్టాన్లు కడుపు ఉబ్బరం సమస్యను మరింత పెచుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

click me!

Recommended Stories