swimming benefits: ఇలా ఈత కొడితే సులభంగా బరువు తగ్గుతారంటున్న నిపుణులు..

Published : Apr 03, 2022, 09:44 AM IST

swimming benefits: ప్రతి రోజూ ఈత కొట్టడం వల్ల మానసిక ఒత్తిడి ఇట్టే తగ్గుతుంది. అలసట దూరమవుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ గా స్విమ్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చంటున్నారు నిపుణులు.  

PREV
17
swimming benefits: ఇలా ఈత కొడితే సులభంగా బరువు తగ్గుతారంటున్న నిపుణులు..

ఎండాకాలం షురూ కావడంతో పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు ఈత కొడుతుంటారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి గంటల తరబడి నీళ్లలో ఈత కొడుతుంటారు. స్విమ్ చేయడం వల్ల బాడీ హీట్ తగ్గడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా.. 

27
​ ​

ఈత కొట్టడం వల్ల శరీరంలో ఫిట్ గా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. అలసట కూడా దూరమవుతుంది. అందుకే ప్రతిరోజూ ఈతకొట్టండి.  ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు రెగ్యులర్ గా ఈత కొట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అంటున్నారు నిపుణులు. అవును క్రమం తప్పకుండా ఈత కొడితే ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
 

37

నిత్యం ఈత కొడితే శరీరంలో ఉండే కేలరీలు ఖర్చైపోతాయి. పరుగెత్తితే ఎలా అయితే వెయిట్ లాస్ అవుతారో.. అలాగే స్విమ్మింగ్ చేస్తే కూడా అలాగే బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అయితే ఈత ద్వారా బరువు తగ్గాలనుకునే వారు కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి. అవి పాటిస్తేనే సులభంగా బరువు తగ్గుతారు. అవేంటంటే.. 
 

47

స్విమ్మింగ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు..మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అలా అని ఓవర్ గా తినకూడదు. ముఖ్యంగా మీ రోజు వారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఈత ద్వారా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఒకే విధంగా స్విమ్మింగ్ చేయకూడదు. ఒక్కో రోజూ ఒక్కో విధంగా కొట్టాలి. ఇందుకోసం స్మిమ్మింగ్ నిపుణుడిని సంప్రదించొచ్చు. 
 

57
swimming

Swimming stroke‌ వల్ల  శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను, అధిక కేలరీలను ఇట్టే కరిగించొచ్చు. ఇందులో బటర్ ఫ్లై స్ట్రోక్ వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చంటున్నారు నిపుణులు. ఈ బటర్ ఫ్లై స్ట్రోక్ ను రోజుకు పదినిమిషాలు చేస్తే 150 కేలరీలు ఖర్చవుతాయట.  అలాగే ఫ్రీ స్టైల్ స్ట్రోక్ ను రోజుకు ఒక పావుగంట పాటు చేస్తే సుమారుగా 700 కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

67

ఈత కొడుతూ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఉదయం పూట స్మిమ్మింగ్ చేయడం మంచిది. అదికూడా బ్రేక్ ఫాస్ట్ కు ముందే. దీనివల్ల శరీరంలో అధనంగా పేరుకుపోయిన కొవ్వులు ఇట్టే కరిగిపోతాయి. స్విమ్మింగ్ చేస్తుంటే మన శరీరంలో ఆ కొవ్వులను శక్తిగా మార్చుతుంది. దీంతో మీరు సులభంగా వెయిట్ లాస్ అవుతారు. 

77

ఈత కొడుగు కేలరీలు బర్న్ చేయాలనుకుంటే మీరు నెమ్మదిగా స్విమ్మింగ్ చేయకూడదు. కేలరీలు బర్న్ అవ్వాలంటే వేగంగా ఈతకొట్టాలి. ఎంత వేగంగా ఈదితే.. అన్ని కేలరీలు ఇట్టే ఖర్చైపోతాయి. కాబట్టి ఈతకొట్టేటప్పుడు వేగం పెంచండి. 

click me!

Recommended Stories