ఈ ఒక్కటి చేసినా.. నోట్లో నుంచి దుర్వాసన రాదు

First Published | Nov 8, 2024, 11:41 AM IST

నోటి దుర్వాసన చాలా చిన్న సమస్య అయినా.. దీనివల్ల నలుగురిలో నవ్వడానికి, మాట్లాడటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మానసికంగా నిరాశను కూడా కలిగిస్తుంది. కాబట్టి చాలా సింపుల్ గా ఈ నోటి దుర్వాసనను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Remedies for bad breath

బయటపెట్టరు కానీ నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొనే వారు చాలా మందే ఉన్నారు. మీ వ్యక్తిత్వం ఎంత మంచిదైనా, మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత బాగున్నా.. నోట్లో నుంచి దుర్వాసన వస్తే మాత్రం అది మీ విలువను తగ్గిస్తుంది.

నిజానికి నోట్లో నుంచి చెడు వాసన వచ్చే వారి పక్కన కూర్చొని ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడరు. దీనివల్ల మానసికంగా ఎంతో బాధకలుగుతుంది.  

ఈ సమస్య వల్ల ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పదేపదే నలుగురిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


సోంపు

సోంపు నోటి దుర్వాసనను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  మీకు తెలుసా? వెల్లుల్లి, ఉల్లిపాయను తిన్న తర్వాత నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. కాబట్టి వీటిని తర్వాత నోటి వాసన రాకూడదంటే సోంపును నమలండి.

మీ జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత అరటీస్పూన్ సోంపును నమలండి. ఇది నోట్లో నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. 
 


నోటి దుర్వాసనకు ఆవనూనె, ఉప్పు

అవును ఆవనూనె, ఉప్పు నోటి దుర్వాసనను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఆవనూనె, ఉప్పుతో మసాజ్ చేస్తే కొన్ని రోజుల్లోనే నోట్లో నుంచి చెడు వాసన రావడం తగ్గుతుంది.  ఇందుకోసంఆవనూనెలో చిటికెడు ఉప్పు కలపండి.

దీన్ని చిగుళ్లకు రాసి మర్దన చేయండి. ఇలా రోజుకు ఒకసారి చేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒకప్పుడు పెద్దలు ఉప్పు, ఆవనూనెతోనే పళ్లను తోముకునేవారు. 

నిమ్మకాయ 

నిమ్మకాయ కూడా నోటి దుర్వాసనను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిజానికి నిమ్మకాయ ఒక్క బరువును తగ్గించడమే కాదు.. నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ వాటర్ తో మీరు ప్రతిరోజూ ఉదయం నోటిని కడిగితే నోట్లో నుంచి చెడు వాసన రాదు. అలాగే మీరు ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లను తాగితే మీరు బరువు తగ్గడమే కాదు.. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది.

నిమ్మకాయ లాలాజల గ్రంథులను సక్రియం చేస్తుంది. అలాగే నోట్లో ఉన్న ఇన్వాసివ్ బ్యాక్టీరియాను చంపుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుతుంది. మీకు తెలుసా? నాలుకపై ఉండే తెల్లని మచ్చల వల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. అయితే లెమన్ జ్యూస్ ఈ పొరను తొలగించి నోటి నుంచి వాసన రాకుండా చేస్తుంది. 
 

లవంగాలు

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? పంటి నొప్పి వచ్చినప్పుడు పెద్దలు పళ్ల కింద లవంగాలను పెడుతుంటారు.

పళ్ల కింద లవంగాలను పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించడమే కాకుండా.. నోటి దర్వాసనను కూడా తగ్గిస్తాయి. 

bad breath

గ్రీన్ టీ

గ్రీన్ టీని తాగినా కూడా నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోట్లో నుంచి దుర్వాసన రాకుండా చేయడానికి సహాయపడతాయి. మీకు తెలుసా? నోటి దుర్వాసనను రాకుండా చేయడంలో గ్రీన్ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగితే నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గడమే కాకుండా.. నోటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

Latest Videos

click me!